నిరాశపరచను, నన్ను నమ్మండి

Sunday,July 02,2017 - 03:02 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ నెలల గ్యాప్ లోనే థియేటర్స్ లో సందడి చేస్తున్న నేచురల్ స్టార్ నాని ఈ వీక్ ‘నిన్ను కోరి’ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే ఉండడంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని.. సినిమా కచ్చితంగా బాగుంటుందని, నన్ను నమ్మండి అంటున్నాడు. ప్రెజెంట్ ట్రైలర్, సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా తన కెరీర్ లో ఓ మెమొరబుల్ మూవీ అవుతుందని.. జులై 7 రిలీజ్ కానున్న ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ నుంచి మీతో పాటు ఇంటికి వచ్చేస్తుందని అంతలా ఈ సినిమాకి కనెక్స్ట్ అవుతారని అంటున్నాడు నాని. ఈ కామెంట్ తో నాని సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడని, ‘నిన్ను కోరి’ తో నాని మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. మరి నాని చెప్పినట్టు ఈ సినిమా అంతలా కనెక్ట్ అవుతుందో లేదో తెలియాలంటే జులై 7 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.