వరల్డ్ సినిమా – తెలుగు రీమేక్స్

Thursday,August 15,2019 - 01:04 by Z_CLU

టాలీవుడ్ లో రీమేక్స్ కొత్తేం కాదు.. కాకపోతే ఈ మధ్య వరల్డ్ సినిమాలు కూడా తెలుగులో రీమేక్ అయ్యాయి. మేకర్స్ అఫీషియల్ గా రైట్స్ కొనుగోలు చేసి మరీ ఈ సినిమాల్ని తెరకెక్కించారు. వాటికి తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేంజెస్ చేయడంతో స్ట్రేట్ సినిమాల స్థాయిలో ఈ సినిమాలు కనెక్ట్ అయ్యాయి.

 

మన్మధుడు 2 : ఫ్రెంచ్ సినిమా ‘ I Do’ కి రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. సినిమాలోని మెయిన్ సబ్జెక్ట్ ని అడాప్ట్ చేసుకున్న మేకర్స్, నాగ్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టు, కావాల్సినన్నీ హ్యూమర్ ఎలిమెంట్స్ ని జత చేసి సినిమాని తెరకెక్కించారు.

ఎవరు : ఈ రోజు రిలీజైన అడివి శేష్ ‘ఎవరు’ సినిమా కూడా రీమేకే. ‘The Invisible Guest’ అనే స్పానిష్ సినిమాని తెలుగులో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా తెరకెక్కించారు మేకర్స్. ఇవాల్టి నుండి థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది.

హే బేబీ : ‘Miss Granny’ అనే కొరియన్ మూవీకి రీమేక్ సమంతా నటించిన ‘హే బేబీ’ సినిమా. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అందుకుంది.