అప్పుడు చైతన్య... ఆ తర్వాత అఖిల్... ఇప్పుడు స్యామ్

Tuesday,July 30,2019 - 10:02 by Z_CLU

 ‘మన్మధుడు 2’ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. చాలా రోజుల తరవాత నాగ్ ని మన్మధుడిలా చూడబోతున్నామని ఎగ్జైట్ అయిన ఆడియెన్స్ కి, ఈ సినిమాలో కావాల్సినంత కామెడీ కూడా బోనస్ గా దొరుకుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో నాగార్జున పేరు స్యామ్… ట్రైలర్ లో ఈ పేరు వినిపించిన ప్రతిసారి అక్కినేని ఫ్యాన్స్ కి సమంతా గుర్తుకొస్తుంది.

నాగార్జునకి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ పేరుని సినిమాలో క్యారెక్టర్ కి పెట్టుకోవడం కొత్తేం కాదు…  గతంలో 1991 రిలీజైన ‘చైతన్య’ సినిమాలో నాగ్ పేరు కూడా అదే. ఈ సినిమాలో ప్రేమగా చై పేరును పెట్టుకున్న నాగ్, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సూపర్’ సినిమాలో ‘అఖిల్’ అని పెట్టుకున్నాడు.

ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో కొత్తగా చేరిన మెంబర్ సమంతా ముద్దుపేరు ‘స్యామ్’ ని, ఈ సినిమాలో క్యారెక్టర్ కి పెట్టుకున్నాడు నాగార్జున. దాంతో ఈ పేరు వినిపించినప్పుడల్లా ఫ్యాన్స్ కి గతంలో నాగ్ అఖిల్, చైతన్యల పేర్లను తన క్యారెక్టర్స్ కి పెట్టుకున్న విషయం గుర్తుకొస్తుంది.

ఈ సినిమాలో సమంతా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి నాగ్ సమంతా పేరు పెట్టేసుకుంటే, మరి సమంతా ఈ సినిమాలో ఏ పేరు పెట్టుకుందో చూడాలి…