'మన్మధుడు 2' రియల్ జర్నీ

Tuesday,August 06,2019 - 10:02 by Z_CLU

జస్ట్ ఒక్క సినిమా ‘చి.ల.సౌ’. సక్సెస్ రాహుల్ రవీంద్రన్ ని నాగార్జున సినిమాకి దర్శకత్వం వహించే స్థాయికి తీసుకువెళ్ళింది. అందునా నాగ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘మన్మధుడు’ టైటిల్ తో… అసలీ సినిమా జర్నీ ఎలా బిగిన్ అయిందంటే…

స్టేజ్ 1 : అవి ‘చి.ల.సౌ.’ సినిమా ప్రీ రిలీజ్ ఫార్మాలిటీస్ లో మేకర్స్ బిజీగా ఉన్నప్పటి రోజులు. ఆ సినిమా చూసిన నాగ్ రాహుల్ రవీంద్రన్ ని అప్రీషియేట్ చేయడం జరిగింది. సక్సెస్ గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ తో, సినిమాని తన బ్యానర్ లోనే రిలీజ్ చేయాలని డెసిషన్ తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఈ హడావిడిలోనే నాగార్జున రాహుల్ రవీంద్రన్ కి ఈ సినిమా ఆఫర్ ఇచ్చాడు. నిజానికి ఫ్రెంచ్ సినిమాకి రీమేక్ చేయాలన్న ఆలోచన రాహుల్ ది కాదు. నాగార్జున ది.

స్టేజ్ 2 : ‘మన్మధుడు 2’ ఫ్రెంచ్ సినిమాకి రీమేకే అయినా తెలుగు వరకు వచ్చేసరికి కథ చాలా మారింది. చి.ల.సౌ. స్క్రిప్ట్ ని జస్ట్ 10 రోజుల్లో కంప్లీట్ చెసుకున్న దర్శకుడు, ఈ సినిమా వరకు వచ్చేసరికి చాలా మార్పులు, చేర్పులు చేసుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే కథను రాసుకున్నది రాహులే అయినా, సూపర్ విజన్ మొత్తం నాగార్జున దే.

 

స్టేజ్ 3 : ఫ్రెంచ్ సినిమా కథను బట్టి నిజానికి హీరో ఏజ్డ్ కాదు. కానీ తెలుగులో అలాగే ప్రెజెంట్ చేయాలన్న నిర్ణయం నాగార్జునది. రాహుల్ చేత క్యారెక్టరైజేషన్ దగ్గరి నుండి డైలాగ్స్ వరకు తన నిర్ణయం మేరకే సెటైరికల్ గా  రాయించుకున్నాడు.

స్టేజ్ 4 : ‘మన్మధుడు 2’ లో నటించిన ప్రతి యాక్టర్ సీనియరే. దాంతో రాహుల్ కి ఈ సినిమా జర్నీ కూడా చాలా ఈజీ అయింది. కథలోని ప్రతి పాయింట్ ని పర్టికులర్ గా రాసుకున్న దర్శకుడు, పర్ఫామెన్స్ వరకు వచ్చేసరికి, ఎలాంటి సలహాలు ఇవ్వలేదు.. న్యాచురల్ గా ఎవరి స్టైల్ లో వాళ్ళు పర్ఫామ్ చేశారు.

స్టేజ్ 5 : ఫ్రెంచ్ కథను బట్టి సమంతా రోల్ సినిమాకి అవసరం లేదు. కానీ రాహుల్ చాలా కేర్ తీసుకుని సినిమాలో ఓ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం నాగార్జున ప్రమేయం కూడా లేకుండానే స్యామ్ ని కన్విన్స్ చేసుకున్నాడు.