రియాలటీలో సీనియర్ హీరోలు

Saturday,June 15,2019 - 11:02 by Z_CLU

రియల్ లైఫ్ సీనియర్ హీరోలు సినిమాల్లో కూడా ఏజ్డ్ అని ఒప్పుకుంటారు. దర్శకులు కూడా ఈ పాయింట్ నే కీ  హిలేరియస్ పాయింట్ గా ఎంచుకుంటున్నారు. దాంతో సినిమాలు మరింత రియల్ న్యాచురల్ గా ఉండి ఆడియెన్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి.

నాగార్జున : ‘మన్మధుడు2’ లో నాగార్జున వయసైపోయిన బ్యాచిలర్ లా కనిపించబోతున్నాడు. ఈ రియాలిటీని ఫ్యాన్స్ కూడా అంతే జాయ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో కూడా కీ ఎలిమెంట్ ఇదే కాబోతుంది. సినిమాలో యంగ్ నాగార్జున… ఆ క్యారెక్టర్ చుట్టూ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ ఉంటాయి కానీ, మ్యాగ్జిమం సినిమా మాత్రం సీనియర్ నాగార్జున చుట్టే తిరుగుతుంది.

వెంకటేష్ :  వెంకీ చాలా సినిమాల్లో ఏజ్ ప్రస్తావన ఉంది. అంతెందుకు త్వరలో సెట్స్ పైకి రాబోతున్న ‘దే దే ప్యార్ దే’ సినిమా రీమక్ లోను వెంకీ 50 ఏళ్ల పైబడిన వాడిలా కనిపించబోతున్నాడు. సినిమాలో ఈ హీరో సీనియర్ హీరో ఓ యంగ్ అమ్మాయితో లవ్ లో పడతాడన్నమాట.

గతంలో ‘జైసింహా’ సినిమాలో కూడా బాలయ్య కాస్త ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించాడు. కాకపోతే అది సినిమాలో హిలేరియస్ ఎలిమెంట్. ఏది ఏమైనా కథల్లో ఈ ఏజ్ ఎలిమెంట్ ఆడ్ అయ్యేసరికి సినిమాల్లో మరింత రియాలిటీ చేరి, అన్ని ఏజ్ గ్రూప్స్ కి సినిమాలు కనెక్ట్ అవుతున్నాయి.