ప్రభాస్ ఫేవరేట్ హీరోయిన్స్ వీళ్ళే...

Thursday,August 15,2019 - 12:03 by Z_CLU

ప్రభాస్ ‘సాహో’ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అయితే ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపికా పాడుకొనే, ఆలియా భట్ తన ఫేవరేట్ హీరోయిన్స్ అని చెప్పుకున్నాడు.

ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్స్ తో జత కట్టడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా ‘ఏక్ నిరంజన్’ సినిమాలో కంగనా రనౌత్ తోనటించాడు. ఇక ‘సాహో’ తరవాత సెట్స్ పైకి  రాబోతున్న సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్.

బాహుబలి తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్, ఇప్పుడు సాహో కోసం శ్రద్ధా కపూర్ ని ఎంచుకున్నాడు. ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఆలియా భట్, దీపికాల పేరు మెన్షన్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ లో కొత్త క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి.

ప్రభాస్ ఇకపై బాలీవుడ్ హీరోయిన్స్ తోనే జత కడతాడా..? బాలీవుడ్ లో ఇంతమంది హీరోయిన్స్ ఉండగా, జస్ట్ ఈ ఇద్దరి పేర్లే పర్టికులర్ గా మెన్షన్ చేశాడంటే, తన ఫ్యూచర్ సినిమాల్లో ఈ ఇద్దరినీ ప్రిఫర్ చేయబోతున్నాడా..? ఇప్పటికిప్పుడే ఈ క్వశ్చన్స్ వెదకడం కష్టమే కానీ… తన సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకోబోయే హీరోయిన్స్ స్టాండర్డ్స్ మాత్రం చెప్పకనే చెప్పేశాడు యంగ్ రెబల్ స్టార్.