ప్రేమతో ప్రియాంక...

Monday,September 19,2016 - 03:36 by Z_CLU

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాది మామూలు ఫాలోయింగ్ కాదు. తనదైన గ్లామర్ తో తనకంటూ ఓ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెరపై సంచలనం సృష్టించబోతోంది. తాజాగా ప్రియాంక క్వాన్టికో అనే సీజన్ లో నటించింది. ఈ సీజన్ టీవీలో ఎప్పుడెప్పుడు ప్రసారమౌతుందా? అని ఎదురుచూస్తున్నారు అమ్మడు అభిమానులు.

    అభిమానుల ఆసక్తిని అర్ధం చేసుకున్న ఈ భామ తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఈ వీడియో ను ఓ వారం ముందే విడుదల చేసింది. “ఇక మీరు ఎదురుచూడాల్సిన అవసరం లేదు ఇదిగో వారం ముందే ఈ సీజన్ వీడియో ను చూసెయ్యండి.”అంటూ ఈ వీడియో ను పోస్ట్ చేసింది. ప్రియాంకా ఇలా పోస్ట్ చేసిందో లేదు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.. అభిమానులపై ప్రేమతో ప్రియాంక చోప్రా ఇలా వారం ముందే పండగ తీసుకొచ్చింది.