నేను ఆపేసా... నువ్వు ఆపొచ్చుగా...?

Monday,September 19,2016 - 01:07 by Z_CLU

సమంత లేటెస్ట్ డైలాగ్ ఇది…? నాగచైతన్యను రోజూ ఇదే ప్రశ్న అడుగుతోంది సమంత. తను సినిమాలు దాదాపు ఆపేశానని… నువ్వు ఎప్పుడు ఆపుతావంటూ నాగచైతన్యను అడుగుతోంది. జనతా గ్యారేజ్ తర్వాత సమంత సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేసింది. కానీ నాగచైతన్య మాత్రం వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. సమంత కోపానికి కారణం ఇదేనట.

కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరూ… త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారు. ఆ విషయాన్ని వీళ్లిద్దరూ చెప్పకపోయినా నాగార్జున మాత్రం కన్ ఫర్మ్ చేశాడు. త్వరలోనే ఆ తేదీని ప్రకటిస్తానని ఎనౌన్స్ చేశాడు. అయితే నాగచైతన్య ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయట. ఇప్పటికే రెండు సినిమాలు కంప్లీట్ చేసిన ఈ అక్కినేని హీరో, ఇంకో సినిమా పూర్తిచేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

   సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాల్ని ఇప్పటికే పూర్తిచేశాడు చైతూ. వీటిలో ప్రేమమ్ సినిమా త్వరలోనే విడుదలకానుంది. ఆ తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు చైతూ. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. మరోవైపు సమంత మాత్రం “నేను సినిమాలు ఆపేశా… నువ్వెప్పుడు గ్యాప్ ఇస్తావ్” అంటూ చైతూ వెంటపడుతోందట.