ప్రతిష్టాత్మక బాలీవుడ్ స్టూడియో ఫర్ సేల్

Wednesday,August 29,2018 - 12:48 by Z_CLU

కపూర్ ఫ్యామిలీకి సంబంధించిన RK స్టూడియోస్ ని అమ్మకానికి పెట్టింది యాజమాన్యం. 70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ 4 ఎకరాల స్టూడియోని అమ్మేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటించింది కపూర్ ఫ్యామిలీ.

2017 సెప్టెంబర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్టూడియోలో కొంత శాతం కాలిపోవడంతో, నిన్నా మొన్నటి వరకు ఈ స్టూడియోని కొత్త టెక్నాలజీ తో రేనోవేట్ చేసే ఆలోచనలో ఉంది కపూర్ ఫ్యామిలీ. అంతలో ఆలోచన మార్చుకున్న యాజమాన్యం, ఈ హిస్టారికల్ స్టూడియోని అమ్మేద్దామని ఫిక్సయింది.

ఈ స్టూడియోలోని స్టేజ్ 1 కి హిస్టారికల్ వ్యాల్యూ ఉంది. 120 ft /80 ft ఉన్న షూటింగ్ ఫ్లోర్ ఆసియా లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లోర్ గా గుర్తించబడింది. 1948 లో రాజ్ కపూర్ స్థాపించిన ఈ స్టూడియో RK ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చే సినిమాలకు సంబంధించి హెడ్ క్వార్టర్ లా మారింది. రాజ్ కపూర్ సినిమాలు ‘ఆవారా’, ‘బూట్ పాలిష్’, ‘శ్రీ 420’, ‘జాతేరహో’ లాంటి సినిమాలు ఈ స్టూడియో లోనే నిర్మించారు.

 

వీటన్నింటి కన్నా ముందు ఈ RK బ్యానర్ లో నిర్మించిన రాజ్ కపూర్ సినిమా ‘బర్సాత్’ సూపర్ హిట్టవ్వడంతో అదే సెంటిమెంట్ ని కొనసాగిస్తూ, ఈ సినిమాలోని స్టిల్ నే కంపెనీ లోగో గా పెట్టుకున్నారు. ఆ తరవాత RK స్టూడియో అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది.

రాజ్ కపూర్ సినిమాలతో ఎంత కనెక్టివిటీ ఉందో, రాజ్ కపూర్ నిర్మించిన ఈ స్టూడియోతో కూడా ఫ్యాన్స్ లో అంతే ఇమోషనల్ కనెక్టివిటీ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ లో భారీగా నష్టపోయిన RK స్టూడియోస్, అ నష్టాన్ని భర్తీ చేస్తూ, మెయిన్ టైన్ చేయడం కష్టంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఏది ఏమైనా ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ స్టూడియోని ఎవరు సొంతం చేసుకుంటారా..? అనే క్యూరియాసిటీ కూడా కనిపిస్తుంది.