షార్ట్ గ్యాప్ .... మూడు సినిమాలతో !

Sunday,March 08,2020 - 01:02 by Z_CLU

అంతకుముందు అడపాదడపా క్యారెక్టర్స్ చేసినప్పటికీ ‘పెళ్లి చూపులు’ తో హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది రీతు వర్మ. ‘పెళ్లి చూపులు’ తో వచ్చిన పాపులారిటీతో ఇక అమ్మడు టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుందని అనుకున్నారంత. కట్ చేస్తే ‘కేశవ’ సినిమా ఒక్కటే చేసి టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ కి షిఫ్టయి అక్కడ హీరోయిన్ గా బిజీ అయింది.

అయితే ఈ తెలుగమ్మాయి మళ్ళీ టాలీవుడ్ లో సినిమా చేస్తుందా అనుకునే లోపే నాలుగు సినిమాలు కమిట్ అయి మళ్ళీ తన సత్తా చాటుకుంది. అవును రీతు వర్మ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. నానితో ‘టక్ జగదీష్’ , శర్వానంద్ తో ఓ సినిమా అలాగే నాగ శౌర్య తో మరో సినిమా చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. వీటిలో శర్వానంద్ సినిమా బైలింగ్వెల్ గా తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది.