షారుక్ ఖాన్ 'జీరో' ట్రైలర్ రిలీజ్

Friday,November 02,2018 - 05:23 by Z_CLU

బాలీవుడ్ మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘జీరో’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ స్టార్ షారుక్ ఖాన్ మరగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. గతంలో ‘తను వెడ్స్ మను’, ‘రంజానా’ వంటి సినిమాలతో ఎంటర్టైన్ చేసిన దర్శకుడు ఈసారి ఓ కొత్త ప్రయత్నం చేసాడు.

ఈ సినిమా కోసం కాన్ఫిడెన్స్ తో అసాద్యాన్ని సుసాధ్యం చేయగల  ఓ మరగుజ్జు వాడి కథను ఎంచుకొన్న దర్శకుడు ఆ కథను పర్ఫెక్ట్ గా డీల్ చేసాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. షూటింగ్ ఫినిష్ చేసుకొని ఫాస్ట్ ఫేజ్ లో  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.