బాలీవుడ్ లో ఎవరినీ వదిలిపెట్టను – కంగనా రనౌత్

Saturday,February 09,2019 - 10:06 by Z_CLU

రీసెంట్ గా రిలీజయింది మణికర్ణిక సినిమా. అయితే ఈ సినిమాకి థియేటర్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కంగనా రనౌత్ చుట్టూ మాత్రం చాలా నెగెటివిటీ అల్లుకుంది. సాధారణంగా స్ట్రేట్ ఫార్వార్డ్ గా ఉండే కంగనా రనౌత్,ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మందికి దూరమయింది. అయితే ఆ కోపాన్ని వాళ్ళు సినిమాపై కూడా చూపించారని చెప్పుకుంది.

నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ కి బాలీవుడ్ నుండి పెద్దగా సపోర్ట్ దొరకలేదు కంగనాకి. సినిమా సెట్స్ పై ఉన్నప్పటి నుండే కంగనా ఈ సినిమాకోసం స్ట్రాంగ్ గా నిలబడింది. అయితే కొందరు బాలీవుడ్ దిగ్గజాలు కనీసం, రాణి ఝాన్సీ కోసమైనా, చరిత్రను గౌరవించైనా సినిమాకి సపోర్ట్ చేసి ఉండాల్సిందని ఫీలయింది కంగనా.

ఏది ఏమైనా తను ఒంటరిని చేసి కంప్లీట్ బాలీవుడ్ ఒక్కటై తనని ఇబ్బంది పెట్టారు కాబట్టి, ఇక ఇప్పుడు తానేం చేయగలదో చూపిస్తానని,  బాలీవుడ్ లో ఎవరినీ వదిలిపెట్టను అని మీడియాతో కోపంగా చెప్పుకుంది కంగనా రనౌత్.