ఇక బయోపిక్స్ సీజన్ ముగిసినట్టేనా!

Tuesday,February 26,2019 - 01:28 by Z_CLU

మహానటి తో బిగిన్ అయింది టాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్. ఈ సక్సెస్ మరిన్ని బయోపిక్ లను సెట్స్ పైకి తీసుకొచ్చింది. ఈ సినిమా రిలీజైన సంవత్సరం కూడా తిరగక ముందే వరసగా, NTR బయోపిక్, యాత్ర, లక్ష్మీస్ NTR, విశ్వదర్శనం, చంద్రోదయం ఇలా వరసగా టాలీవుడ్ లో బయోపిక్ సీజన్ నడుస్తుందా అనిపించేంతలా  స్పీడ్ అందుకున్నాయి. అయితే మహానటితో సీజన్ క్రియేట్ అయింది సరే, మరి NTR బయోపిక్ తో ఈ సీజన్ క్లోజవుతుందా..?

తప్పెక్కడ జరిగి ఉంటుందా అనేది ఇక్కడ పాయింట్ కాదు కానీ, ‘NTR కథానాయకుడు’, ‘మహానాయకుడు’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన అంచనాలను అందుకోలేకపోయాయి. సీనియర్ NTR పై ఉన్న క్రేజ్, NTR గెటప్ లో బాలయ్య చరిష్మా ఈ బయోపిక్ ని రిలీజ్ కి ముందు వరకు లైమ్ లైట్ లో ఉంచగలిగినా, సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ చూసిన ఆడియెన్స్ మాత్రం భేష్ అనలేకపోయారు.

సినిమా రిలీజైన ప్రతి చోట బాలకృష్ణ పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ వస్తుంది. ఎమోషనల్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించడంలో క్రిష్ తరవాతే ఎవరైనా అంటూ, క్రిటిక్స్ నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే అవన్నీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోతున్నాయి.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చంద్రోదయం, విశ్వదర్శనం (కె.విశ్వనాధ్ బయోపిక్) లాంటి బయోపిక్స్ ఫ్యూచర్ ఏంటనేది ప్రస్తుతం గెస్ చేయడం కష్టమే కానీ, ప్రతి బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అవ్వదనే క్లారిటీ మాత్రం వచ్చేసింది