మాయ చేసి అప్పుడే 9 ఏళ్లయింది

Tuesday,February 26,2019 - 01:39 by Z_CLU

నాగచైతన్యకు కెరీర్ లో రెండో సినిమా. సమంతకు అదే మొదటి సినిమా. అయినప్పటికీ అది మాయచేసింది. ఆడియన్స్ ను కట్టిపడేసింది. వాళ్ల యాక్టింగ్ కు ఇప్పటికీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అదే ఏమాయచేశావె సినిమా. ఇవాళ్టికి ఈ సినిమా విడుదలై 9 ఏళ్లయింది.

అప్పుడే 9 ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేం. అంత ఫ్రెష్ గా ఉంటుంది ఈ సినిమా. ఇప్పటికీ ఇందులో నాగచైతన్య-సమంతను చూస్తుంటే వీళ్లకు పెళ్లయిందనే విషయం గుర్తుకురాదు. అలా సిల్వర్ స్క్రీన్ పై ఎవర్ గ్రీన్ లవర్స్ గా నిలిచిపోయింది ఈ జంట.

రెహ్మాన్ మ్యూజిక్, గౌతమ్ మీనన్ డైరక్షన్, మనోజ్ సినిమాటోగ్రఫీ, అందమైన లొకేషన్లు, హార్ట్ టచింగ్ సీన్స్.. ఏమాయచేశావె సినిమాను రొమాంటిక్ క్లాసిక్ గా మార్చేశాయి. చైతూ-సమంత ఈ సినిమా నుంచే ప్రేమలో పడ్డారట.