ఇదంతా క్రేజేనా..? లేకపోతే ఇంకేమైనా...

Tuesday,February 26,2019 - 11:03 by Z_CLU

నిన్న కైరా అద్వానీ… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న శ్రద్ధా కపూర్, RRR లో ఆల్మోస్ట్ కన్ఫమ్ అనిపిస్తున్న  ఆలియా భట్ నిజంగానే తెలుగు సినిమా కరియర్ ని సీరియస్ గా తీసుకున్నారా..?  ఉన్న పళంగా బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి టికెట్ తీసుకుంటున్న ఈ భామలు టాలీవుడ్ లో ఉండేదెన్నాళ్ళు…?

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ, ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ‘వినయ విధేయ రామ’ సినిమాకి కూడా సంతకం చేసింది. ఈ 2 సినిమాలు రిలీజై పోయాయి. నెక్స్ట్ ఏంటి..? ఇప్పటి వరకు కైరా తన నెక్స్ట్ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇకపై తెలుగు సినిమాలు చేస్తుందా లేదా..? ఈ 2 సినిమాలతోనే  సరిపెట్టుకుంటుందా..?

 

‘సాహో’ లో శ్రద్ధా కపూర్ ని మనవాళ్ళే ఏరి కోరి తెచ్చుకున్నారు. కాకపోతే శ్రద్ధా కపూర్ ఈ సినిమాకి ఓకె అనడానికి  రీజన్  మాత్రం  డెఫ్ఫినెట్ గా ప్రభాసే. బాహుబలి తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పక్కన చాన్స్ అంటే ఎవరు వదులుకుంటారు..? అయితే ఇక్కడ ప్రస్తావన  ఏంటంటే ‘సాహో’ తరవాత శ్రద్ధా కపూర్, మరో సినిమాకి సంతకం చేస్తుందా..? లేదా..?

 

ఆలియా భట్ కూదా దాదాపు ఇదే స్ట్రాటజీ మెయిన్ టైన్ చేస్తుంది. రాజమౌళి సినిమా సెట్స్ పై ఉందంటే వరల్డ్ వైడ్ గా కాన్సంట్రేషన్ ఉంటుంది. ఇక సినిమా రిలీజైతే ఆ సినిమాలో కొన్ని నిమిషాలు కనిపించినా చాలు రేంజ్ మారిపోతుంది. అలాంటిది హీరోయిన్ చాన్స్ ఎందుకు వదులుకుంటుంది. అందుకే నో అని చెప్పి ఉండదు.  అది సరే… ఈ సినిమా తరవాత మళ్ళీ టాలీవుడ్ వైపు  కనీసం చూస్తుందా..? లేదా..?

గతంలోనూ ఇంతే జస్ట్ స్టార్ వ్యాల్యూ తోనో, మన ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేసిన ఫ్యాన్సీ రేట్ కోసమో టాలీవుడ్ వచ్చిన నోటెడ్  హీరోయిన్స్ ప్రీతి జింటా, మనీషా కొయిరాలా, కత్రినా కైఫ్, అమీషా పటేల్, సోనాలి బింద్రే, శిల్పా శెట్టి లాంటి హీరోయిన్స్ జస్ట్ ఇలా వచ్చి కమిట్ అయిన సినిమా చేసేసి వెళ్ళిపోయారు. అంతేకానీ తెలుగు సినిమాతో కనెక్ట్ అయిన దాఖలాలు పెద్దగా లేవు. వీళ్ళు కూడా ఇంతేనా..? లేకపోతే బాలీవుడ్ లాగే టాలీవుడ్ ని కూడా సీరియస్ గా తీసుకుంటారా అనేది చూడాలి.