NTR గా బాలయ్య... మరి బాలయ్యగా...?

Saturday,January 05,2019 - 10:02 by Z_CLU

సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా NTR బయోపిక్ హవా నడుస్తుంది. ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్స్ ఈ వైబ్స్ కి ఓ రీజన్ అయితే, సినిమాలో సందర్భానుసారంగా, ఆయా రోల్స్ ని ప్లే చేసిన స్టార్స్ మరో రీజన్. అయితే రీసెంట్ ఈ సినిమా డిస్కర్షన్స్ లో కొత్త క్వశ్చన్ రేజ్ అయింది. ఇంతకీ ఈ బయోపిక్ లో బాలకృష్ణ రోల్ ప్లే చేసింది ఎవరు..?

NTR లైఫ్ లోని కీలక దశల్లో ఆయనకి క్లోజ్ అయిన ప్రతి పాత్రని, ఆ పాత్రని పోషించిన స్టార్ ని రివీల్ చేసిన మేకర్స్, ‘బాలకృష్ణ’ క్యారెక్టర్ ని మాత్రం ఎక్కడా ప్రస్తావించట్లేదు. NTR రోల్ లో బాలకృష్ణ, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నప్పుడు, మరి బాలకృష్ణ రోల్ ప్లే చేసింది ఎవరు…? ఈ క్వశ్చన్ కి క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.

ఈ బయోపిక్ లో ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రెజెంట్ చేస్తున్నామని చెప్పుకున్న కళ్యాణ్ రామ్, బాలకృష్ణ క్యారెక్టర్ ని అసలు ఇన్వాల్వ్ చేయలేదట. మహా అయితే ఈ బయోపిక్ లో  చైల్డ్ హుడ్ సీక్వెన్సెస్  లో అక్కడక్కడా బాలయ్య గురించి ప్రస్తావన ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజర్. జనవరి 9 కథానాయకుడు’, ఫిబ్రవరి 7  ‘మహానాయకుడురిలీజవుతున్నాయి. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ సినిమాని  నిర్మించారు.