'NTR' బయోపిక్ వెనక అసలు కథ

Thursday,January 03,2019 - 06:53 by Z_CLU

రాజకీయ నాయకుడిగా, మహా నటుడిగా ఎదిగిన NTR రియల్ లైఫ్ లో, ఆయన అభిమానులకు తెలియని సంగతులెన్నో. వాటన్నింటినీ అందంగా కూర్చి మరీ కథానాయకుడు, మహానాయకుడు గా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ బయోపిక్ ఆలోచన అసలు బాలయ్యకు ఎప్పుడు వచ్చింది..? ఈక్వశ్చన్ కి సమాధానం చెప్పాడు బాలయ్య.

‘ఏడాదిన్నర క్రితం నాన్నగారి స్వస్థలం నిమ్మకూరు వెళ్ళినప్పుడు అక్కడ ఓ సభలో మాట్లాడుతుండగా నా నోటి నుండి అనుకోకుండా, త్వరలోనే నాన్నగారి బయోపిక్ చేస్తానని వచ్చేసింది. నిజానికి అప్పటికి అసలు ఆలోచన కూడా నాకు లేదు కాబట్టి, ఆ మాటని నేను తరవాత సీరియస్ గా కూడా తీసుకోలేదు. కానీ కొన్నాళ్ళ తరవాత ఎందుకో ఆ స్టేజ్ పై నేను అనేసిన మాట గుర్తుకొచ్చి, నా నెక్స్ట్ సినిమాగా నాన్నగారి బయోపిక్ చేయాలని ఫిక్సయ్యి, కథ రాయించడం మొదలుపెట్టా. అలా ఈ సినిమా నిమ్మకూరులో ఓ సభలో పుట్టింది అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.’

NTR లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు, మరెంతో మంది స్టార్స్ నటించిన ఈ బయోపిక్ డెఫ్ఫినెట్ గా అంచనాలకు మించి అలరిస్తుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ బయోపిక్ లోని ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9 రిలీజైతే, ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7 న రిలీజవుతుంది.