హైలెట్ గా నిలిచిన బాలయ్య, NTR ల స్పీచ్

Saturday,December 22,2018 - 01:38 by Z_CLU

నిన్న జరిగిన NTR బయోపిక్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో ప్రతీది స్పెషల్ గా నిలిచింది. ఇండస్ట్రీ పెద్దలు ఇచ్చిన స్పీచ్, ఈ బయోపిక్ కి మరింత ఇమోషనల్ గా ఎటాచ్ అయ్యేలా చేసింది. అయితే ఈ ఈవెంట్ లో బాలయ్య, NTR ల స్పీచ్ మరింత  హైలెట్ గా నిలిచింది.

NTR : నేను తాతగారు చేసిన ఎన్నో సినిమాలు చూశాను. కానీ మొట్ట మొదటి సారి ఈ సినిమాలో తాతగారిని చూస్తున్నాను. ఈ చిత్రం విజయం  సాధించాలని   నేను   కోరుకోను,   ఎందుకంటే  విజయం      సాధించాకే ఈ చిత్రం మొదలైంది. చరిత్రకి జయాపజయాలు ఉండవు. చరిత్ర సృష్టించడమే ఉంటుంది. బాలకృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నానికి, ఆయన కన్న ఈ కలకి వెన్నుదన్నుగా నిలిచిన క్రిష్ నాకు ఆప్త  మిత్రుడు  అని చెప్పుకున్నాడు NTR .

బాలకృష్ణ : నాన్నగారు  చేసిన   పాత్రలు  ఏవైనా   మీరు చేసారా..? అని ఎవరైనా అడిగితే, ఆయన కరియర్ లో ఆయన చేయని నారద ముని  పాత్ర, గౌతమీ పుత్ర శాతకర్ణీ  పాత్రలు చేశానని గర్వంగా  చెప్పుకున్నా.   కానీ  ఆయన  పాత్రే  చేస్తానని కనీసం కలలో కూడా అనుకోలేదు. మన సంకల్పం బలంగా ఉన్నాప్పుడు, అష్ట దిక్పాలకులు, పంచభూతాలు      మన చేత ఆ కార్యాన్ని   ఎలాగైనా చేయిస్తాయి. నాన్నగారు, మా అమ్మగారు బసవ తారకమ్మ గారు అనుకుని, వాళ్ళు మా చేత ఈ పని చేయించుకున్నారు, మేం చేస్తున్నాం అంతే… అని ఇమోషనల్  గా  చెప్పుకున్నాడు    బాలయ్య.