టాలీవుడ్ అప్ కమింగ్ ఎట్రాక్షన్స్

Tuesday,January 01,2019 - 10:14 by Z_CLU

మూవీ లవర్స్ కి మోస్ట్ ఫేవరెట్ ఇయర్ గా మారబోతుంది ‘2019’.. ఈ ఏడాది జనవరి నుండే బడా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్  మిస్ అయిన స్టార్ హీరోలు కూడా ఈ ఇయర్ భారీ సినిమాలతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పొలిటికల్ డ్రామాలు, ఫ్యామిలీ  ఎంటర్టైనర్స్ , పిరియాడిక్ డ్రామా, మాస్ కమర్షియల్,  కామెడీ సినిమాలు ఇలా అన్ని జోనర్ల సినిమాలు 2019 ని స్పెషల్ ఇయర్ గా మార్చబోతున్నాయి.  ఈ ఇయర్ రిలీజవుతున్న టాప్ మోస్ట్ సినిమాలపై ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ స్టోరి.

‘NTR కథానాయకుడు’ సినిమాతో 2019 మూవీ సీజన్ స్టార్ట్ కానుంది. జనవరి 9 న ‘NTRకథానాయకుడు’ సినిమాతో అభిమానులని అలరించనున్న బాలయ్య ఫిబ్రవరి 7 ‘NTRమహా నాయకుడు’ సినిమాతో మళ్ళీ  థియేటర్స్ లో అడుగు పెట్టనున్నాడు. నందమూరి తారక రామారావు గారి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి.

బాలయ్య తర్వాత  ‘వినయ విధేయ రామ’ తో జనవరి 11 న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు రామ్ చరణ్.. బోయపాటి డైరెక్షన్ లో ఫ్యామిలీ & మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం మాస్ ఆడియన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. చరణ్ -బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2019 బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.

ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో స్పెషల్ మూవీ గా నిలిచింది ‘F2’ . వెంకటేష్ -వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఫ్యామిలీ & ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ 2019 లో టాప్ మూవీ అనిపించుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12 థియేటర్స్ లోకి రానుంది.

సంక్రాంతి సీజన్ తర్వాత తనకి పర్ఫెక్ట్ అనిపించే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అఖిల్. ‘తొలి ప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా జనవరి 25 న రిలీజ్ కి రెడీ అయింది.

ఈ ఏడాది ‘NTR మహానాయకుడు’ సినిమాతో పాటు మరో పొలిటికల్ డ్రామా ‘యాత్ర’ కూడా థియేటర్స్ లోకి వస్తోంది. మమ్ముట్టీ హీరోగా దివంగత వై.ఎస్.ఆర్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారిని స్పెషల్ గా  ఎట్రాక్ట్ చేస్తూ ఈ ఏడాది స్పెషల్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

మహేష్ బాబు 25వ సినిమా ‘మహర్షి’ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ 2019 ఎవైటింగ్ మూవీ అనిపించుకుంటుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదలై సమ్మర్ మూవీ సీజన్ షురూ చేయనుంది.

లాస్ట్ ఇయర్ ‘కృష్ణార్జున యుద్ధం’తో ఆడియన్స్ ని డిస ప్పాయింట్ చేసిన నాని ఈ ఏడాది ఓ స్పెషల్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. క్రికెట్ బేస్డ్ మూవీ ‘జెర్సీ’ తో ఈ ఏడాది కొత్తగా అలరించడానికి రెడీ అవుతున్నాడు.  గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జెర్సీ’ ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

ఎగ్జాక్ట్ గా ఎప్పుడొస్తుందో తెలియదు కానీ మెగా స్టార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా’ కూడా ఈ ఏడాది లోనే రానుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ ఆలోచనలో ఉన్న మేకర్స్ ఒక వేళ సమ్మర్ మిస్ అయినా ఏడాది చివర్లో అయినా  కచ్చితంగా ఈ సినిమా థియేటర్స్ లోకి దింపాలని చూస్తున్నారు.

ప్రస్తుతం ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న నాగ చైతన్య -సమంత ‘మజిలి’ కూడా ఈ ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ కానుంది. శివ నిర్వాన డైరెక్షన్ లో చై- సామ్ భార్య భార్తలుగా నటిస్తున్న ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి.

లాస్ట్ ఇయర్ డబుల్ హిట్ కొట్టి స్టార్ అఫ్ ది ఇయర్ అనిపించుకున్న విజయ్ దేవర కొండ… ఈ ఏడాది సమ్మర్ లో ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవర- కొండ రశ్మిక ఈ ఏడాది కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

ఓ పిరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాతో ఈ ఏడాది థియేటర్స్ లోకి రానున్నాడు శర్వానంద్. సుదీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది.  ఈ సినిమాతో సమ్మర్ బరిలో దిగనున్నాడు శర్వా.

ఈ ఇయర్ మోస్ట్ ఎవైటింగ్ మూవీస్ లో సాహో ఒకటి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15 న థియేటర్స్ లోకి రానుంది. సుజీత్ డైరెక్షన్ లో మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టి ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం పక్కా అనే వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కూడా ఈ ఏడాది థియేటర్స్ లో సందడి చేయనుంది.. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బన్నీ ఎనర్జీ , త్రివిక్రమ్ రైటింగ్ ఇలా స్పెషల్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఈ ఏడాదిని మరింత స్పెషల్ గా మార్చనుంది.

ఈ ఏడాది నాని నుండి మరో సినిమా కూడా థియేటర్స్ లోకి రానుంది. జెర్సీ తో సమ్మర్ లో సందడి చేయనున్న నేచురల్ స్టార్ ఇయర్ ఎండింగ్ లో విక్రం కుమార్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఈ రెండు సినిమాలతో 2019 ని స్పెషల్ గా మార్చుకోబోతున్నాడు నాని.

వరుణ్ తేజ్ కూడా ఓ రీమేక్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ రెండు సినిమాలతో హీరోగా అలరించిన వరుణ్ ఈ ఏడాది హరీష్ శంకర్ సినిమాతో పాటు మరో సినిమాను కూడా థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. తమిళ్ లో విజయం సాదించిన ‘జిగర్తాండ’ ను రీమేక్ చేయనున్న హరీష్ ఈ సినిమాలో వరుణ్ ని నెగిటీవ్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడు.

ఈ ఇయర్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న కాంబినేషన్స్ లో రవితేజ – వి ఐ ఆనంద్ కాంబినేషన్ ఒకటి..  ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. లాస్ట్ ఇయర్ ప్రేక్షకులను అలరించలేకపోయిన రవి తేజ ఈ ఏడాది మాత్రం ఆడియన్స్ ను ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయాలనీ చూస్తున్నాడు.

సంక్రాంతి సీజన్ లో F2 సినిమాతో సందడి చేయనున్న వెంకీ ఇయర్ ఎండింగ్ లో అల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ గా ఎంటర్ టైన్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ షురూ చేసుకొని ఏడాది చివర్లో థియేటర్స్ లోకి రానుంది.

బాలయ్య -బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో సినిమా ఈ ఇయర్ టాప్ మూవీస్ లో ఒకటి. ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారా లేదా అనే క్యూరియాసిటీ నెలకొంది.

సోగ్గాడు చిన్ని నాయన కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘బంగార్రాజు’ సినిమా కూడా ఈ ఇయర్ స్పెషల్ మూవీ గా ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో చైతూ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తాడనే టాక్ బయటికి రావడంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలో డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.