మరి సమంతా హీరో ఎవరు..?

Friday,May 24,2019 - 11:02 by Z_CLU

నాగార్జున ‘మన్మధుడు 2’ లో సమంతా కూడా నటిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం ఇదే ఫస్ట్ టైమేమీ కాదు. ‘మనం’, ‘రాజుగారి గది 2’ సినిమాల్లోనూ కలిసి నటించారు ఈ మామా కోడళ్ళు. అయితే ఇక్కడ టాపిక్ ఈ ఇద్దరు ఎన్ని సినిమాలు చేశారు కాదు… ఈ సినిమాలో సమంతా హీరో ఎవరు..?

ప్రస్తుతం సమంతా, నాగ్ కాంబినేషన్ లో సీన్స్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. వీటికి సంబంధించిన ఎన్ని స్టిల్ రిలీజైనా  సమంతా హీరో ఎవరన్నది ఎక్కడా రివీల్ కావడం లేదు. దీన్ని బట్టి సినిమాలో నాగ్, రకుల్ లీడ్ రోల్స్ కాబట్టి సమంతాకి పర్టికులర్ గా హీరో ఉండే అవకశాలు లేవనే అనిపిస్తుంది. దానికి తోడు సమంతా రోల్ విషయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

‘మన్మధుడు 2’ లో ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతుంది. ఈ సీక్వెన్సెస్ లో సమంతా ఓ డిఫెరెంట్ రోల్ లో కనిపిస్తుందట. సినిమాలో నాగ్ కి సమాంతకి మధ్య రిలేషన్ ప్రస్తుతానికైతే సస్పెన్సే కానీ, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఉండబోయే ఎపిసోడ్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది.

ఈ మామా కోడళ్ళ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రత్యేకంగా వీళ్ళిద్దరి కోసమే పర్టికులర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాసుకున్నాడా..? అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ, ఈ ఇద్దరి కాంబినేషన్ ని మాత్రం అంతే ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తున్నాడని తెలుస్తుంది.