నాగార్జున – గతంలో కూడా ఒకసారి...

Saturday,July 27,2019 - 10:02 by Z_CLU

‘మన్మధుడు 2’ సినిమా ‘మన్మధుడు’ కి సీక్వెల్ కాదు అన్న క్లారిటీ బిగినింగ్ నుండే ఉంది. కానీ ఈ సినిమా పక్కా అఫీషియల్ రీమేక్ అన్న విషయం రీసెంట్ గా నాగ్ కన్ఫమ్ చేసేదాకా తెలీదు. అయితే ఇలా ఫ్రెంచ్ సినిమాని రీమేక్ చేయడం నాగ్ కి ఇదే ఫస్ట్ టైమ్ కాదు…

గతంలో నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన ‘ఊపిరి’ కూడా ఫ్రెంచ్ ‘అన్ టచబుల్స్’ కి రీమేకే. బాడీ మొత్తం కదలలేని పరిస్థితుల్లో ఉన్నా కేవలం ఫేస్ తో మాత్రమే యాక్ట్ చేసి, తనలోని బెస్ట్ యాక్టర్ ని ప్రెజెంట్ చేశాడు నాగ్ ఈ సినిమాలో… కానీ ‘మన్మధుడు 2’ వరకు వచ్చేసరికి కొంచెం వేరు…

‘మన్మధుడు2’ లో ప్లే చేసిన క్యారెక్టర్ గతంలో నాగ్ ప్లే చేసిందే. కథతో ఏ మాత్రం సంబంధం ఉండదు కానీ, క్యారెక్టర్ మాత్రం ‘మన్మధుడు’ లో ఉన్నట్టుగానే ఉండబోతుంది.

ఫ్రెంచ్ సినిమాకి రీమేకే అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు కావాల్సినన్నీ చేంజెస్ చేసుకుని మరీ ఈ సినిమాని తెరకెక్కించాడు రాహుల్ రవీంద్రన్. ఓ రకంగా చెప్పాలంటే ఈ రీమేక్ తో టాలీవుడ్ లో హిలేరియస్ సీజన్ ని క్రియేట్ చేయబోతున్నారు.