‘నందిని రెడ్డి’ ప్లాన్స్ ఏంటి...?

Friday,May 24,2019 - 12:02 by Z_CLU

2011 లో ‘అలా మొదలైంది’ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయింది నందిని రెడ్డి. ఈ 9 ఏళ్లలో తిప్పి కొడితే చేసినవి నాలుగే నాలుగు సినిమాలు ‘ఓ బేబీ’ తో కలిపి… కాకపోతే ఈ డైరెక్టర్ నుండి ఏ సినిమా వచ్చినా మినిమం ఎంటర్టైన్ మెంట్ గ్యారంటీ అనే బ్రాండ్ అయితే ఉంది ఆడియెన్స్ లో… మరి దానికి తగ్గట్టు కొత్త సినిమా ‘ఓ బేబీ’ కూడా ఉండబోతుందా..?

ఇంతవరకు నందిని రెడ్డి చేసిన సినిమాలన్నీ సొంతంగా రాసుకున్నవే. కానీ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ కొరియన్ సినిమాని రీమేక్ చేస్తుంది. రీమేక్ ఆలోచన కూడా ఇప్పటి వరకు చేయని నందిని రెడ్డి, సడెన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది..? ‘మిస్ గ్రానీ’ లో తనకు అంతగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి..?

‘మిస్ గ్రానీ’ నుండి ఈ సినిమాని ‘ఓ బేబీ’ గా ట్రాన్స్ ఫామ్ చేయడానికి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది నందిని రెడ్డి. నిజానికి ‘మిస్ గ్రానీ’ ప్రకారం సినిమాలో సీనియర్ నటి లక్ష్మీ ప్లే చేస్తున్న రోల్ ని కూడా సమంతా నే ప్లే చేయాలి. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది. కొరియన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘మిస్ గ్రానీ’ కథను అడాప్ట్ చేసుకున్నా, స్క్రీన్ ప్లే లో మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చేంజెస్ చేసినట్టు తెలుస్తుంది.

చూడాలి మరీ… దాదాపు మూడేళ్ళ గ్యాప్.. సమంతా లాంటి స్టార్ హీరోయిన్…. సరికొత్త కాన్సెప్ట్ తో నందిని రెడ్డి ఆడియన్స్ ని ఏ స్థాయిలో ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తుందో… ఇంకేమేం ప్లాన్ చేసిందో…