నాగచైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్

Friday,November 23,2018 - 01:19 by Z_CLU

ఈ రోజు తన 32 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు నాగచైతన్య. ఈ సందర్భంగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది ఈ ఫస్ట్ లుక్. ఓల్డ్ వెస్పా పై ప్లెజెంట్ స్మైల్ తో ఉన్న నాగచైతన్య స్టిల్ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

ఇంకా టైటిల్ కూడా డిసైడ్ అవ్వని ఈ సినిమాని మోస్ట్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ. సమాంత, చైతు ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కపుల్ లా మెస్మరైజ్ చేయనున్నారు. రీసెంట్ గా వైజాగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న టీమ్, ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ లో ఉన్నారు.

ఈ సినిమాలో సమాంతతో పాటు దివ్యాంశ కౌశిక్ సెకండ్  హీరోయిన్ గా నటిస్తుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.