స్టార్ హీరోలకు అందుబాటులో సమంతా

Thursday,June 20,2019 - 11:02 by Z_CLU

సమంతాకి అవకాశాలు రావట్లేదు… గత నెల రోజులుగా ఖాళీగా ఉంటుంది..’

ఈ మాట అన్నది ఎవరో కాదు అక్షరాలా సమంతానే. ‘హే బేబీ’ షూటింగ్ కంప్లీట్ అయింది. ‘శర్వా’ కి  యాక్సిడెంట్  అవ్వడంతో 96 షూటింగ్ కి బ్రేక్ పడింది. తను పూర్తిగా కోలుకున్నాక గానీ అది స్టార్ట్ అవ్వదు.. చేతిలో ఈ 2 సినిమాలు తప్ప ఇంకేమీ లేవు కాబట్టి ప్రస్తుతం ఖాళీగా ఉంది సమంతా…

రీసెంట్ గా ‘మజిలీ’ రిలీజయింది. ఇప్పుడు ‘హే బేబీ’ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఒక్క తెలుగులోనేనా..? తమిళంలో కూడా అంతే బిజీ.  గత ఏడాదైతే 2 భాషల్లో కలిపి ఏకంగా 7 సినిమాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల మధ్య బిజీగా దూసుకుపోతున్న సమంతాకి ఈ బ్రేక్ కూడా మంచికే.

అయితే కొన్ని రోజులుగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల పైనే దృష్టి పెట్టిన సమంతా ఈసారి స్టార్ హీరో సరసన సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే సమంతా ఇచ్చిన స్టేట్ మెంట్ ని బట్టి, ఎవరూ అప్రోచ్ అయిన దాఖలాలు అయితే లేవు కానీ, ఆమె మాత్రం ఆల్మోస్ట్  స్టార్ హీరోల సినిమాలకు 100% అందుబాటులో ఉన్నట్టే.

చూడాలి మరీ.. ‘హే బేబీ’… ‘96’ తరవాత సమంతా సంతకం చేయనున్న స్టార్ హీరో సినిమా ఏంటో…? ఎవరి దర్శకత్వంలో మళ్ళీ ఫుల్ టైమ్ కమర్షియల్ హీరోయిన్ లా కనిపించనుందో?