అల్లు అర్జున్ హీరోయిన్ – ఎవరీ కేతిక శర్మ...?

Friday,May 24,2019 - 10:02 by Z_CLU

అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ఇది సినిమా సెట్స్ పైకి రాకముందు నుండే అఫీషియల్ గా అనౌన్స్ అయిన విషయం. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కేతికశర్మ ఫిక్సయినట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్ ని మరీ తప్పదనుకుంటేనే పక్కన పెడతాడు కానీ, అవకాశం ఉంటే మాత్రం తూ.చ. తప్పకుండా పాటిస్తాడు. కాబట్టి ఈ న్యూస్ మరీ షాకింగ్ గా లేకపోయినా, ఈ హీరోయిన్ పై మాత్రం ఫోకస్ నిలుస్తుంది. ఇంతకీ ఎవరీ కేతిక శర్మ..?

23 ఏళ్ల కేతిక శర్మ అటు చదువుకుంటూనే ఇటు యూట్యూబర్ గా భారీస్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఇంస్టాగ్రామ్ లో ఆక్టివ్ గా ఉండేవాళ్లకు కేతికశర్మ అసలు కొత్తే కాదు. బేసిగ్గా మాడల్ కాబట్టి రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టిల్స్ తో, డబ్ స్మాష్ వీడియోస్ తో, సాంగ్స్ తో మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది ఈ ఢిల్లీ బేస్డ్ భామ.

సాధారణంగా ఓ సినిమాతో ఇంట్రడ్యూస్ అయి, ఆ సినిమా సక్సెస్ అయితే ఆ హీరోయిన్ కి ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ లో క్రేజ్ అవుతుంది. కానీ కేతిక విషయంలో కంప్లీట్ గా డిఫెరెంట్. ఆల్రెడీ స్టార్ అనిపించుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది కేతిక. ఇప్పుడు బన్ని సినిమాలో అవకాశం దొరికింది కూడా కేతిక సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన సెన్సేషనే…

బన్ని సినిమాతో పాటు పూరి ఆకాష్ ‘రొమాంటిక్’ సినిమాలోను ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది కేతిక శర్మ. స్పీడ్ చూస్తుంటే ఇదే ఏడాది తెలుగులో మరిన్ని సినిమాలకు సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరీ సోషల్ మీడియాలో పాప్యులర్ స్టార్ అనిపించుకున్న కేతిక.. అంతే ఈజీగా సినిమా కరియర్ ని కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా సక్సెస్ ఫుల్ గా డిజైన్ చేసుకోగలుగుతుందా..? ఇంకొన్నాళ్ళు ఆగితే తెలిసిపోతుంది.