అఖిల్ తరవాత ఇప్పుడు సమంతా..?

Friday,August 23,2019 - 11:03 by Z_CLU

రీసెంట్ గా ‘హలో’ సినిమా కోసం పార్కొర్ ట్రైనింగ్ తీసుకున్నాడు అఖిల్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ గా నిలిచాయి అఖిల్ చేసిన ఫీట్స్.  ఇప్పుడు ఇలాంటి ట్రైనింగే సమంతా తీసుకుంటుంది. రీసెంట్ గా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. అయితే అక్కణ్ణించే ఫ్యాన్స్ లో క్వశ్చన్స్ బిగిన్ అయ్యాయి.

సమంతా స్ట్రిక్ట్ గా వర్కవుట్స్ చేస్తుందన్న విషయం తెలిసిందే కానీ, సడెన్ గా ఈ పార్కొర్ ట్రైనింగ్ దేనికీ..? కొత్తగా ఉంటుందని నేర్చుకుంటుందా…? లేకపోతే నిజంగానే ఇది తన నెక్స్ట్ సినిమా కోసం చేస్తున్న ప్రిపరేషనా..? అసలు సమంతా ప్లానింగ్ ఏంటి..?

నిన్నా మొన్నటి వరకు వరస రీమేక్స్ తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న స్యామ్, ఇకపై రీమేక్స్ చేయకూడదని ఫిక్సయింది. కానీ ఎక్స్ పెరిమెంట్స్ మాత్రం అస్సలు ఆపనని చెప్పింది. అంతలో ఈ కొత్త ట్రైనింగ్… అసలు సమంతా నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది..?

సమంతా ఏం చేసినా డిఫెరెంట్ గా ఉంటుందనే ఇమేజ్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా క్రియేట్ అయింది. ఆ స్టాండర్డ్స్ ని రీచ్ అవ్వడం కోసం తన ప్రతి సినిమాలో ఏదో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చూడాలి మరీ…  ఇప్పుడు కష్టపడి తీసుకుంటున్న ఈ పార్కొర్ ట్రైనింగ్ తో  ఏం చేయబోతుందో స్యామ్…

View this post on Instagram

Never be afraid to try new things .. you will be surprised at what you’re capable of .. loving parkour @abhinavparkour #mightymouse

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on