వీకెండ్ రిలీజెస్

Thursday,February 21,2019 - 12:37 by Z_CLU

మొన్నటివరకు స్తబ్దుగా ఉన్న బాక్సాఫీస్ ఒక్కసారిగా వేడెక్కబోతోంది. ఈ వీకెండ్ ఒకేసారి అరడజను సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ మూవీ డీటెయిల్స్ ఎక్స్ క్లూజివ్ గా మీకోసం..

 

వచ్చేవి 6 సినిమాలైనా అందులో పెద్ద సినిమా ఒకటే. అదే ఎన్టీఆర్-మహానాయకుడు. కథానాయకుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. క్రిష్-బాలయ్య కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ జీవితంతో పాటు చంద్రబాబు ప్రస్తావన కూడా ఉంది. అందుకే తెలుగు ఆడియన్స్ ను ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తోంది. పైగా చంద్రబాబు క్యారెక్టర్ ను రానా పోషించడం సినిమాకు పెద్ద హైలెట్ గా మారింది. ఈ పార్ట్ తో ఎన్టీఆర్ బయోపిక్ ను ముగించబోతున్నాడు బాలకృష్ణ.

 

కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి చేసిన సినిమా మిఠాయి. ఈ సినిమాకు వీళ్లిద్దరే క్రౌడ్ పుల్లర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్, డార్క్ కామెడీతో ఈ సినిమా తెరకెక్కిందని కచ్చితంగా హిట్ అవుతుందని
కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు ఈ కమెడియన్లు. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార మరో సినిమా రెడీ చేసింది. ఆమె నటించిన `ఇమైక్కా నొడిగ‌ల్‌` సినిమా అంజలి సీబీఐగా థియేటర్లలోకి రాబోతోంది. న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌లో ఆర్.అజయ్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో
రూపొందిన ఇన్‌టెన్సివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. విశ్వ‌శాంతి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సి.హెచ్‌.రాంబాబు, ఆచంట గోపీనాథ్ విడుద‌ల చేస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమీజా సంగీతం అందించాడు. విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, అధ‌ర్వ ముర‌ళి, రాశీఖ‌న్నా వంటి భారీ తారాగ‌ణం ఈ సినిమాలో న‌టించారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ విల‌న్‌గా న‌టించాడు.

మిఠాయి టైపులోనే ఎంతో ఫన్ తో, ఇంకాస్త అడల్ట్ కామెడీతో వస్తోంది 4 లెటర్స్. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు A-సర్టిఫికేట్ ఇచ్చారు. ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మించారు.

ఈ సినిమాలతో పాటు ప్రేమెంత పనిచేసే నారాయణ, యాక్సిడెంట్ అనే మరో 2 చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ఎన్టీఆర్ మహానాయకుడ్ని మినహాయిస్తే.. ఈ చిన్న సినిమాల్లో ఏవి క్లిక్ అవుతాయో చూడాలి.