వీకెండ్ రిలీజ్

Wednesday,November 13,2019 - 12:29 by Z_CLU

2 డబ్బింగ్… 2 స్ట్రేట్ సినిమాలు… జోనర్ ని బట్టి చూస్తే దేనికదే స్పెషల్. కానీ బాక్సాఫీస్ దగ్గర ఏది స్ట్రాంగ్ గా నిలబడుతుందనేది ఫ్రైడే రోజు తేలుతుంది. ప్రస్తుతానికైతే ఈ వారం ఎంటర్ టైన్ చేయడానికి రెడీగా ఉన్న సినిమాల వివరాలివి…

తెనాలి రామకృష్ణ B.A.B.L. : సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా. కొంచెం కామెడీ… అక్కడి నుండి ఎమోషన్.. దానికోసమే చేసే యాక్షన్.. ఈ మూడు సెగ్మెంట్ల ప్యాకేజే తెనాలి రామకృష్ణ B.A.B.L. సంవత్సరాల తరబడి కోర్టుల్లో మగ్గుతున్న కేసులను కాంప్రమైజ్ చేసే సాధారణ   లాయర్ మన హీరో. కానీ ఓ క్రిమినల్ కేసును మాత్రం చాలా సీరియస్ తీసుకుంటాడు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. అందుకే న్యాయం కోసం జస్ట్ వాదించడమే కాకుండా ఫైట్స్ కూడా చేస్తాడు. ట్రైలర్ లో ఎలివేట్ చేసిన పాయింట్స్ ఇవి… మరి సినిమాలో కూడా అదే స్థాయి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందా..? లేదా అనేది చూడాలి.

రాగల 24 గంటల్లో : ఈషా రెబ్బ లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. సత్యదేవ్ హీరోగా నటించాడు. కాకపోతే మిస్టీరియస్ గా ఈ క్యారెక్టర్ సినిమాలో చనిపోతుంది. ఇంతకీ ఈ క్యారెక్టర్ ని చంపింది ఎవరు..? ఏ పాయింట్ చుట్టూ తిరిగేదే ‘రాగల 24 గంటల్లో…’. మిస్టరీ ఎలాగూ ఫ్రైడే రివీల్ అవుతుంది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో ఇంప్రెస్ చేస్తుందో…. చూడాలి.

యాక్షన్ : విశాల్, తమన్నా జంటగా నటించిన సినిమా. లీడ్ రోల్స్ రెండూ మిలిటరీ ఆఫీసర్సే… అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ తో తెరక్కిన ‘యాక్షన్’ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.

విజయ్ సేతుపతి : రాశిఖన్నా, విజయ్ సేతుపతి జంటగా నటించిన సినిమా. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రిలీజవుతుంది. విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు రాశిఖన్నా.. ట్రైలర్ లో విజువల్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటంతో సినిమా ఆడియెన్స్ లో భారీగానే రీచ్ అయింది. చూడాలి ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో…