Weekend Releases - ఈ వారం కొత్త సినిమాలు
Tuesday,February 07,2023 - 03:45 by Z_CLU
ప్రతీ వారం లానే ఈ వీకెండ్ కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఫిబ్రవరి సెకండ్ వీక్ లో వస్తున్న సినిమాలేంటి ? వాటిలో ఏ సినిమాకు క్రేజ్ ఉంది ? తెలుసుకుందాం పదండీ.
ఫిబ్రవరి 10 న అమిగోస్ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా ఇందులో కళ్యాణ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ , సాంగ్ సినిమాపై బజ్ తీసుకొచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
శివ రాజ్ హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా వేద ఫిబ్రవరి 9 న డబ్బింగ్ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాను కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ బేనర్ మీద రాధాకృష్ణ తెలుగులోరిలీజ్ చేస్తున్నారు.
అవికా గోర్, సాయి రోనక్ జంటగా మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాప్ కార్న్’ సినిమా కూడా ఈ వీకెండ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న పాప్ కార్న్ చివరి 45 నిమిషాలు సీట్ ఎడ్జ్ మూవీలా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఫిబ్రవరి 10 న శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.
వెంకట్ కళ్యాణ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’ కూడా వీకెండ్ రిలీజ్ లిస్ట్ లో ఉంది . అనిల్ రావిపూడి టైటిల్ పోస్టర్ , టైటిల్ టిజర్ సునీల్, టీజర్ ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , ట్రైలర్ ను హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. సి హెచ్ క్రాంతి కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10 న రిలీజ్ అవుతుంది.
బాబీ సింహా, కాశ్మీర జంటగా నటించిన “వసంత కోకిల” సినిమాతో పాటు , దేశం కోసం , ఐపిఎల్ , సిరిమల్లె పువ్వా అనే సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.