Weekend Release- ఈ వారం నాలుగు సినిమాలు

Tuesday,September 06,2022 - 03:32 by Z_CLU

ఈ వీకెండ్ నాలుగు సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా మరో రెండు స్ట్రైట్ ఫిలింస్. మరి ఈ వీకెండ్ రిలీజ్ అవ్వనున్న ఆ సినిమాలేంటి ? ఎలాంటి కంటెంట్ తో మూవీస్ రాబోతున్నాయి ? తెలుసుకుందాం.

 ఆర్య , ఐశ్వర్య లెక్ష్మి జంటగా శక్తి సౌందరాజన్ తెరకెక్కిన ‘కెప్టెన్’ సినిమా సెప్టెంబర్ 8న గురువారం థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. కోలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేస్ట్ మూవీస్ పై రిలీజ్ చేస్తున్నాడు. కమల్ హాసన్ విక్రమ్ తర్వాత సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తోన్న తమిళ్ డబ్బింగ్ సినిమా ఇదే. ఆర్మీ నేపథ్యంతో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇండియా ఆర్మీ కెప్టెన్ గా నటించాడు ఆర్య.

 

రన్బీర్ కపూర్ , అలియా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ కి రెడీ అయింది. కొన్ని నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకొని చాలా నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్న ఈ  పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజవుతోంది.  కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను సౌత్ లో రాజమౌళి ప్రెజెంట్స్ చేస్తుండటంతో తెలుగు ఆడియన్స్ లోనూ ఆసక్తి నెలకొంది. అయాన్ దర్శకత్వంలో  భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచరస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన హిందీ సినిమా ఇది.

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో డ్రీం వారియర్ పిక్చర్స్ బేనర్ పై S R ప్రకాష్ బాబు , S R ప్రభు నిర్మించిన ‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబర్ 9న థియేటర్స్ లోకి రాబోతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై శర్వా అండ్ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  మంచి కథ దొరికిందని, తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని శర్వా ప్రమోషన్స్ లో చెప్తుండటంతో ఈ సినిమాపై ఓ మోస్తారు అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

ఈ వీకెండ్ ఈ మూడు సినిమాలతో పాటు కొత్త కొత్తగా అనే చిన్న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. హనుమాన్ వాసంశెట్టి దర్శకుడిగా పరిచయమవుతూ కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమా సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన “ప్రియతమా ప్రియతమా” సాంగ్ బిగ్ హిట్ సాధించి సినిమాపై బజ్ తీసుకొచ్చింది. మరి మిగతా సినిమాల టఫ్ కాంపిటీషన్ నడుమ ఈ చిన్న సినిమా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుందా ? రప్పించి మెప్పిస్తుందా చూడాలి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics