వీకెండ్ రిలీజెస్

Wednesday,December 18,2019 - 03:00 by Z_CLU

ఆల్రెడీ థియేటర్లలో నడుస్తున్న వెంకీమామ లాంటి సినిమాలకు ఈసారి గట్టి పోటీ తప్పేలా లేదు. ఎందుకంటే ఈ వీకెండ్ బాలయ్య, సాయితేజ్ సినిమాలు థియటర్లలోకి వస్తున్నాయి. వీటితో పాటు మరో 2 మూవీస్ కూడా క్యూలో ఉన్నాయి.

సాయితేజ్-మారుతి కాంబోలో వస్తోంది ప్రతి రోజూ పండగే సినిమా. రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్ కూడా డిఫరెంట్ గా చేయడంతో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది ఈ ప్రాజెక్టు. ట్రయిలర్ హిట్ అయింది. తమన్ సాంగ్స్ క్లిక్ అయ్యాయి. సో… ఈ వీకెండ్ హాట్ ఫేవరెట్స్ లో ఒకటిగా నిలిచింది ప్రతి రోజూ పండగే.


పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది రూలర్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా… భూమిక, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందించిన “పడతాడు” అనే సాంగ్ ఇప్పటికే హిట్ అవ్వడం, ఈ సినిమాకు ప్లస్.

రూలర్, ప్రతి రోజూ పండగే సినిమాలతో పాటు కార్తి నటించిన దొంగ సినిమా కూడా వస్తోంది. ఇంతకుముందు కార్తి నుంచి వచ్చిన ఖైదీ సినిమా హిట్ అవ్వడంతో, దొంగపై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. పైగా తన రియల్ లైఫ్ వదిన జ్యోతికతో కలిసి కార్తి చేసిన సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అయితే సాయితేజ్, బాలయ్య సినిమాలను తట్టుకొని దొంగ ఏ మేరకు నిలబడతాడనేది చూడాలి.

సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ 3 కూడా ఈ వీకెండ్ వస్తోంది. ప్రభుదేవా డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది. చుల్ బుల్ పాండే విశ్వరూపం ఏంటనేది ఆలిండియా ప్రేక్షకులకు ఇప్పటికే తెలుసు. ఈ మూడో పార్ట్ లో చుల్ బుల్ పాండే గా సల్మాన్ మరింత ఎంటర్ టైన్ మెంట్ అందించడం గ్యారెంటీ అంటోంది యూనిట్. హైదరాబాద్ లో సాయితేజ్, బాలకృష్ణ సినిమాల కంటే దబంగ్3కే ఎక్కువ మల్టీప్లెక్సులు దక్కాయంటే.. ఈ సినిమా క్రేజ్ అర్థంచేసుకోవచ్చు.