షూటింగ్ అప్ డేట్స్

Thursday,February 21,2019 - 10:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…

రాజమౌళి డైరెక్షన్ లో తారక్ , రామ్ చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించి స్మాల్ బ్రేక్ తీసుకున్నారు యూనిట్. ఇటివలే రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసిన యూనిట్ మరో షెడ్యుల్ కి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యుల్ కి సంబంధించి భారీ సెట్ రెడీ చేస్తున్నాడు  సబు సిరిల్. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఈ సెట్ కి సంబందించి పనులు జరుగుతున్నాయి. మార్చ్ నుండి ఈ సెట్ లో భారీ ఎపిసోడ్స్ షూట్ చేయబోతున్నారని సమాచారం. ఈ షెడ్యుల్ లో తారక్ , చరణ్ లతో పాటు  హీరోయిన్స్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. డి.వి.వి ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

మూడు రోజుల క్రితం లాంచ్ అయిన నాని -విక్రం కుమార్ సినిమా సెట్స్ పైకొచ్చేసింది. ప్రస్తుతం  విలన్ గా నటిస్తున్న కార్తికేయ పై రామానాయుడు స్టూడియోలో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమా కోసం నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ సెట్ మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. నాని మార్చ్ 15 నుండి షూట్ లో పాల్గొంటాడని సమాచారం. నాని సరసన ప్రియాంక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుద్ మ్యూజిక్ కంపోజర్.

కొంత గ్యాప్ తర్వాత ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తున్న ‘సిరివెన్నెల’ సినిమా టాకీ పార్ట్ ఫినిష్ చేసుకుంది. ప్రస్తుతం బ్యాలెన్స్ సాంగ్ ని షూట్ చేసే పనిలో ఉన్నారు యూనిట్. అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్న సాంగ్ షూట్ లో ప్రియమణితో పాటు కాలకేయ ప్రభాకర్ , మహానటి ఫేం బాబీ తేజశ్విని పాల్గొంటున్నారు. ప్రకాష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కమల్,బాష నిర్మాతలు. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘కల్కి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటివలే బెంగుళూర్ లో ఒక షెడ్యుల్ ని ఫినిష్ చేసిన యూనిట్ బాదామి లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఈరోజు నుండి హైదరాబాద్ లో మరో షెడ్యుల్ స్టార్ట్ చేసారు. 10 రోజుల పాటు హైదరాబాద్ లోని డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేసి తర్వాత ముంబై కి షిఫ్ట్ అవుతారు యూనిట్. ముంబై లో మూడు రోజుల పాటు జరగనున్న షూట్ తో టాకీ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. మార్చ్ 20 కల్లా టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పి మే నెలలో సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

తన అప్ కమింగ్ మూవీ ‘అర్జున్ సురవరం’ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశాడు నిఖిల్. రెండు రోజుల క్రితం జరిగిన షూటింగ్ తో సినిమాకు సంబందించి టోటల్ షూట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చ్ 29న థియేటర్స్ లోకి రానుంది. నిఖిల్ సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు టి.ఎన్. సంతోష్ దర్శకుడు.