వీకెండ్ రిలీజెస్

Tuesday,October 23,2018 - 01:12 by Z_CLU

ఓ వైపు NTR అరవింద సమేత, దాంతో పాటు లాస్ట్ వీక్ రిలీజైన పందెం కోడి 2, హలో గురూ ప్రేమకోసమే  సినిమాల స్పీడ్ ఇంకా తగ్గనే లేదు అప్పుడే నెక్స్ట్ వీకెండ్ బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి మరో 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటి వివరాలివే…

వీర భోగ వసంత రాయలు : నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియ శరన్ నటించిన డిఫెరెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ ‘వీర భోగ వసంత రాయలు’. ఇప్పటికే ట్రైలర్ తో క్యూరియాసిటీ రేజ్ చేసిన ఈ సినిమా ఈ నెల 26 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి R. ఇంద్రసేన డైరెక్టర్.

బంగారి బాలరాజు : రాఘవ్, కరాణ్య కత్రీన్ జంటగా తెరకెక్కిన లవ్ ఎంటర్ టైనర్ బంగారి బాలరాజు. పరువు ప్రతిష్టల మధ్య సాగే సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాతో కోటేంద్ర దుద్యాల డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ నెల 25 న రిలీజవుతున్న ఈ సినిమా ఆడియెన్స్ ని ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

ఐశ్వర్యాభిమస్తు : ఆర్య, తమన్నా జంటగా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా ‘వసువుం సరవనుం ఒన్న పడిచవంగ’. ఈ సినిమాని తెలుగులో ‘ఐశ్వర్యాభిమస్తు’ గా ఈ నెల 26 న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో విశాల్ పోలీసాఫీసర్ గా కామియో రోల్ ప్లే చేశాడు. M. రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగులో ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

2 ఫ్రెండ్స్: సూరజ్, అఖిల్ కార్తీక్, సోనియా, ఫరా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల నవంబర్ 26 న రిలీజవుతుంది. శ్రీనివాస్ G.L.B. డైరెక్షన్ లో, అనంత లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిందీ సినిమా. పోలూర్ ఘటికాచలం ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.

రథం

గీత ఆనంద్, చాందిని జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ రథం. చంద్రశేఖర్ కానూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 26 న రిలీజవుతుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్, యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది. సుకుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

భాగ్యనగరం

కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ‘రాజధాని’ సినిమా,  తెలుగులో ‘భాగ్యనగరం’ గా ఈ నెల 26 న రిలీజవుతుంది. యష్, షీనా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీ రోల్ ప్లే చేశాడు. మాదక ద్రవ్యాలు, మద్యపానం వీటి మధ్య ఇన్నోసెంట్ యూత్ ఎలా వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.