బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా

Tuesday,October 23,2018 - 02:33 by Z_CLU

రీసెంట్ గా ‘సాక్ష్యం’ సినిమాతో మాస్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాతో సెట్స్ పైకి రానున్నాడు. గతంలో ‘ఒక ఊరిలో’, ‘వీర’, ‘రైడ్’, ‘ఆమ్మాయితో అబ్బాయి’ సినిమాలకు దర్శకత్వం వహించిన రమేష్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. సాక్ష్యం లాంటి పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ తరవాత సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ ని కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ నిర్మాత. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించనున్న హీరోయిన్ తో పాటు, తక్కిన టెక్నీషియన్స్ డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.