సాహో ప్రభాస్: బర్త్ డే గిఫ్ట్ అదిరింది

Tuesday,October 23,2018 - 11:20 by Z_CLU

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టోటల్ టాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సాహో. ఈ మూవీకి సంబంధించి మొట్టమొదటి విజువల్స్ ను విడుదల చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. షేడ్స్ ఆఫ్ సాహో పేరిట విడుదల చేసిన చాప్టర్-1 విజువల్స్ హాలీవుడ్ మూవీని తలపించాయి.

సినిమాలో ఎంతో కీలకమైన అబుదాబి షెడ్యూల్స్ కు సంబంధించిన విజువల్స్ ఇవి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో దాదాపు 60 రోజుల పాటు కష్టపడి కంపోజ్ చేసిన యాక్షన్ విజువల్స్ ను మేకింగ్ వీడియోగా విడుదల చేశారు. ఈ ఒక్క షెడ్యూల్ కే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నిర్మాతలు

ఇక మేకింగ్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ పుట్టినరోజు నాడు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి ఇంతకుమించిన రీజన్ అక్కర్లేదు.