వీకెండ్ రిలీజ్

Wednesday,November 14,2018 - 05:30 by Z_CLU

క్రేజీ సినిమాలతో లైనప్ అయింది ఈ వీకెండ్. లాస్ట్ వీక్ రిలీజైన సినిమాలతో పాటు బాక్సాఫీస్ దగ్గర మరింత హీట్ జెనెరేట్ చేయనున్నాయి ఈ వారం రిలీజవుతున్న సినిమాలు.

టాక్సీవాలా : ఈ వీకెండ్ మోస్ట్ అవేటెడ్ లిస్టులో ఉన్న సినిమా. విజయ్ దేవరకొండ అన్ కాన్షియస్ మైండ్ కి, టాక్సీ కి మధ్య ఉండే రిలేషన్ షిప్ ఈ సినిమాలో హై పాయింట్. ఇప్పటికే సాంగ్స్ తో, ట్రైలర్ తో ఆడియెన్స్ లో క్యూరియాసిటీ జెనెరేట్ చేసిన మేకర్స్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నెల 17 వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతుంది ఈ సినిమా.

అమర్ అక్బర్ ఆంటోని : రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ లో కూడా ఏ మాత్రం హై పాయింట్ రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న మేకర్స్, ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఈ నెల 16 న రిలీజవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

రోషగాడు : విజయ్ ఆంటోని పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రోషగాడు. గణేష డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నివేత పోతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ట్రైలర్ తో మాస్ ఆడియెన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేసిన ఈ సినిమా, థియేటర్స్ లో ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేయనుందో చూడాలి.