‘టాక్సీవాలా’ నా రేంజ్ పెంచేస్తుంది – ప్రియాంక జవాల్కర్

Wednesday,November 14,2018 - 03:40 by Z_CLU

‘టాక్సీవాలా’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అవుతుంది ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించిన ప్రియాంక, తన కరియర్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ‘టాక్సీవాలా’ సినిమా  తన రేంజ్ ని పెంచేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ తెలుగమ్మాయి రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో తన మనసులో మాట చెప్పుకుంది.

‘టాక్సీవాలా’ సినిమా సెట్స్ పై ఉండగానే వేరే సినిమా చాన్సెస్ వచ్చినా ఒప్పుకోలేదు. ఈ సినిమా సక్సెస్ ఇంపాక్ట్ నా కరియర్ పై డెఫ్ఫినేట్ గా ఉంటుంది. అందుకే ‘టాక్సీవాలా’ రిలీజ్ తరవాతే ఏ సినిమా అయినా ఒప్పుకోవాలని ఫిక్సయ్యా. టాక్సీవాలా నా రేంజ్ పెంచేస్తుంది.’ అని చెప్పింది.

ఈ సినిమాలో జూనియర్ డాక్టర్ గా, విజయ్ దేవరకొండ లవ్ ఇంట్రెస్ట్ లా కనిపించనుంది ప్రియాంక జవాల్కర్.  రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17 న రిలీజవుతుంది. జేక్స్ బిజాయ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.