రణవీర్ దీపికల పెళ్ళైపోయింది

Wednesday,November 14,2018 - 07:03 by Z_CLU

బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ లవ్ కపుల్ రణవీర్ దీపికల పెళ్ళి ఘనంగా జరిగింది. ఇటలీలోని లేక్ కోమో లోని విల్లా డెల్ బల్బానిల్లో లో కోన్ ట్రెడిషన్ లో జరిగిన ఈ పెళ్ళి వేడుకలకు దీపికా, రణవీర్ సింగ్ ల కుటుంబ సభ్యులతో పాటు షారుక్ ఖాన్, ఫర్హా ఖాన్ లతో పాటు సంజయ్ లీల భన్సాలి, కరణ్ జోహార్ కూడా అటెండ్ అయ్యాడు.

ఈ రోజు కొంకణి ట్రెడిషన్ లో ఒక్కటైన ఈ జంట, రేపు సింధీ ట్రెడిషన్ లో మరోసారి పెళ్ళి చేసుకోనున్నారు. భారీ సెక్యూరిటీ మధ్య జరిగిన ఈ వేడుకల్లో డ్రోన్ ఇంటర్ సెప్టర్స్ తో పాటు, పెళ్ళికి హాజరైన ప్రతి అతిథి చేతికి యూనిక్ QR కోడ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పెళ్ళి జరిగే సమయంలో ఫోటోలు తీయడం కూడా నిషేదించారట సిబ్బంది.

ఇకపోతే ఈ రోజు జరిగిన ఈ పెళ్ళి వేడుకలకు రణవీర్ సింగ్ తన ‘గుండే’ సినిమాలోని  ‘తూనే మారి ఎంట్రీ యార్..’ సాంగ్ పై డ్యాన్స్ చేస్తూ పెళ్ళి మండపానికి చేరుకున్నాడట. రేపు మరోసారి సింధీ ట్రెడిషన్ లో పెళ్ళి చేసుకోనున్న ఈ జంట ఇండియాకి వచ్చీ రాగానే గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు.