మరో సరికొత్త పాత్రతో విక్రమ్

Tuesday,August 16,2016 - 05:05 by Z_CLU

 

పలు వైవిధ్యభరితమైన పాత్రలతో విలక్షణ కథానాయకుడి గా పేరొందిన విక్రమ్ త్వరలోనే మరో సరికొత్త పాత్ర తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. విక్రమ్ తాజాగా నటించిన చిత్రం ‘ఇరుముగన్’ ఈ చిత్రం తెలుగులో ‘ఇంకొక్కడు’ టైటిల్ తో విడుదల కానుంది. విక్రమ్ సరసన నయనతార, నిత్య మీనన్ నటించారు. ఇటీవలే ఈ చిత్ర తెలుగు వెర్షన్ కు సంబంధించిన ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో విక్రమ్ మాట్లాడుతూ ” మరో కొత్త పాత్రతో అలరించడానికి వస్తున్నా. ఈ చిత్రం లో అఖిల్, లవ్ అనే పాత్రలు పోషించాను. వీటిలో లవ్ అనే పాత్ర నా కెరీర్ లో మరో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నా ఇదొక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం. ఖచ్చితంగా మిమ్మల్ని అలరించి విజయం సాధిస్తుందని భావిస్తున్నా.”అని అన్నారు.