టెస్ట్ సిగ్నల్ షురూ సెప్టెంబర్ 4 న మెగా లాంచ్..

Wednesday,August 17,2016 - 11:20 by Z_CLU

దిల్ పై సూపర్ హిట్ అంటూ పసందైన సినిమాలతో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘జీ సినిమాలు’ ఛానల్. ఈ సందర్భంగా ‘సరైనోడు’ లో సాంబార్ పేరుతో స్టార్ ఇమేజ్ అందుకొని నటి గా దూసుకుపోతున్న విధ్యులేక “హాయ్ నా పేరు బుజ్జి నాకు లైఫ్ లో ఇష్టమైనవి రెండే రెండు ఒకటి ‘ఫుడ్’ రెండు ‘సినిమా’ “అంటూ చేసిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవలే మెగా స్టార్ చేతుల మీదుగా క్లాప్ అందుకున్న జీ సినిమాలు ఛానల్ ప్రస్తుతం టెస్ట్ సిగ్నల్ లో ప్రత్యేక్షమవుతుంది. సెప్టెంబర్ 4 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇప్పటి వరకూ రోజుకో సినిమాతో అలరించిన జీ తెలుగు సంస్థ నుండి రానున్న ఈ జీ సినిమాలు ఛానల్ లో ఇక నుండి మీకు నచ్చిన మీరు మెచ్చిన సూపర్ హిట్ చిత్రాలను రోజుకు 6 షోలుగా చూడొచ్చు.