'సుడిగాలి' సినిమా షూటింగ్ ప్రారంభం

Tuesday,August 16,2016 - 04:24 by Z_CLU

శివపార్వతి క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేష్ గౌడ్ ,మల్లేష్ యాదవ్ ,ప్రాచి అధికారి ,కులకర్ణి మమత హీరో హీరోయిన్లు గా రమేష్ అంకం దర్శకత్వం లో  చెట్టిపల్లి  లక్ష్మి సమర్పించు సుడిగాలి చిత్రం ఈ రోజు ప్రారంభం అయింది. ఈ సినిమా ముహూర్తం షాట్ కు హీరో హీరోయిన్లు పై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఆర్ కె . గౌడ్ క్లాప్,కెమెరా స్విచ్ ఆన్ లయన్ సాయి వెంకట్ . మొదటి షాట్ కి రంగ రవీందర్ గుప్తా గౌరవదర్శకత్వం వహించారు.ఈ సందర్బంగా ఆర్ కె గౌడ్ మాట్లాడుతూ ….. దర్శకుడు రమేష్ నాకు సుడిగాలి చిత్ర కధ చెప్పాడు చాలామంచికథ టైటిల్ కి తగ్గ తగ్గట్టుగా ఉంటుంది తనకి ఇది నాలుగో సినిమా తప్పకుండ మంచి విజయం సాధిస్తుంది ఇక నిర్మాత హీరో ఐన మహేష్ యాదవ్ కి మరియు చిత్ర యూనిట్ కి అల్ ద బెస్ట్ అన్నారు .సాయివెంకట్ మాట్లాడుతూ ….. ఆర్టిస్టులు కొత్తవారు అయినప్పకి కథ బాగుంది కాబట్టి తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది     దర్శకుడు  రమేష్ ఈ సినిమాను చక్కగా డీల్ చేస్తాడు టైటిల్ కూడా చాల బాగా ఉంది టీం కి అభినందనలు. చిన్న సినిమా గా విడుదలై పెద్ద హిట్ సాధించాలి అన్నారు .

రంగరవీంద్రగుప్త మాట్లాడుతూ ……. చిన్న సినిమాలు తీయడం చాల ఈజీ కానీ విడుదల చేయడం కష్టం మంచి పబ్లిసిటీ చేస్తే తప్పకుండ విజయం సాధిస్తుంది నేను ఆ కష్టాలు పది ఉన్నాను కాబట్టి అనుభవంతో చెప్తున్నా అన్నారు .దర్శకుడు రమేష్ మాట్లాడుతూ …. సుడిగాలి అనే పదం మనం విటుంటాం దాన్ని బేస్ చేసుకుని చేస్తున్నసినిమా ఇది అసలు సుడిగాలి అంటే చాల మంది దెయ్యం అంటారు ఆ దెయ్యాన్ని మా సుడిగాలి లో చూపిస్తున్నాం రెగ్యులర్ షూటింగ్ వెళ్తున్నాం అన్నారు .                                                                                       మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్  మాట్లాడుతూ ….. ఇది నాకు పదిహేనో సినిమా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశం ఉంది కథానుగుణంగా మంచి రీ .. రికార్డింగు  కు మంచి స్కోప్ ఉన్న స్టోరీ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు …

హీరో  వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ  నాకు అవకాశం ఇచ్చిన  దర్శక నిర్మాతలకు  థాంక్స్ నాకు మొదటి సినిమా ఇది అన్నారు.               నిర్మాత  హీరో అయిన మల్లేష్ యాదవ్  మాట్లాడుతూ ….. నాకు చిన్నప్పటి నుండి హీరో కావాలని కోరిక అది ఈ సినిమాతో  తీరుతుంది అన్నారు .  హీరోయిన్ ప్రాచి అధికారి  మాట్లాడుతూ  ఇది మంచి సినిమా హారర్ మరియు కామెడీ అందర్నీ తప్పకుండ అలరిస్తుంది నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు . ఇంకా సుహాసిని ,నరసింహ వర్మ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రాప్ రాక్ షకీల్ ,పాటలు శ్రీను సాగర్ ,ఎడిటింగ్ మెనగ శ్రీను నిర్మాతలు చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్ ,బిరాధర్ మల్లేష్ యాదవ్ ,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రమేష్ అంకం .