'వరల్డ్ ఫేమస్' టీజర్ రివ్యూ

Friday,January 03,2020 - 04:48 by Z_CLU

విజయ్ దేవరకొండ మరోసారి బోల్డ్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ రోజు రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. రాశిఖన్నా ప్లే చేసిన యామినీ క్యారెక్టర్ డైలాగ్స్ తో టీజర్ స్టార్ట్ అయితే…. గౌతమ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ తో టీజర్ ఎండ్ అవుతుంది.

ఇకపోతే టీజర్ చూశాక కూడా సినిమాలో ‘విజయ్ దేవరకొండ నాలుగేసి క్యారెక్టర్స్ ప్లే చేయడమేంటి..?’ అని లాంగ్ బ్యాక్ రేజ్ అయి ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ అయితే రివీల్ చేయలేదు మేకర్స్. కొద్దో గొప్పో మిగతా క్యారెక్టర్స్ కి సంబంధించి చిన్న చిన్న విజువల్స్ ని ఇన్సర్ట్ చేశారు మేకర్స్.

అల్టిమేట్ గా సినిమాలో గౌతమ్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ మార్క్ బోల్డ్ నెస్ తో ఉండబోతుందనిపిస్తుంది. అలాంటప్పుడు మిగతా క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయా..? వేరియేషన్స్ ఉంటాయా…? ఒక్కమాటలో చెప్పాలంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చుట్టూ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది ఈ టీజర్.

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ కి రెడీ అవుతుంది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై K.S. రామారావు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.