సెన్సార్ పూర్తి చేసుకున్న బన్నీ, మహేష్ మూవీస్

Friday,January 03,2020 - 02:32 by Z_CLU

సంక్రాంతి బరిలో పోటీపడుతున్న బన్నీ, మహేష్ సినిమాలు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాయి. బన్నీ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాను ఈరోజు సెన్సార్ ఆఫీసర్స్ చూశారు. సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలు ఉంది. ఈ సినిమాకు సంబంధించి మ్యూజికల్ కన్సర్ట్ ను 6వ తేదీన నిర్వహించబోతున్నారు.

అల వైకుంఠపురములో సినిమా కంటే ముందే సెన్సార్ పూర్తిచేసుకుంది సరిలేకు నీకెవ్వరు. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు కూడా U/A వచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఎల్లుండి (జనవరి 5) జరగనుంది.

సెన్సార్ పూర్తయినప్పటికీ ప్రస్తుతానికి ఈ రెండు సినిమా యూనిట్లు తమ రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయలేదు. లెక్కప్రకారం.. మహేష్ మూవీ 11న, బన్నీ సినిమా 12న థియేటర్లలోకి రావాలి. మరికొన్ని గంటల్లో ఈ రిలీజ్ డేట్స్ సస్పెన్స్ వీడిపోతుంది.