వరల్డ్ ఫేమస్ లవర్ ఫైనల్ కలెక్షన్

Thursday,March 19,2020 - 01:50 by Z_CLU

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. స్టోరీలైన్ వీక్ గా ఉండడంతో పాటు చాలా చోట్ల అర్జున్ రెడ్డి ఛాయల్ని రిపీట్ చేయడంతో సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ క్రమంలో తాజాగా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది వరల్డ్ ఫేమస్ లవర్.

ఫైనల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం 8 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూసుకుంటే.. ఇది చాలా తక్కువ. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.

నోటా సినిమానే దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్. ఇప్పుడా రికార్డును వరల్డ్ ఫేమస్ లవర్ క్రాస్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 4.12 కోట్లు
సీడెడ్ – రూ. 0.74 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.86 కోట్లు
ఈస్ట్ – రూ. 0.54 కోట్లు
వెస్ట్ – రూ. 0.42 కోట్లు
గుంటూరు – రూ. 0.72 కోట్లు
నెల్లూరు – రూ. 0.30 కోట్లు
కృష్ణా – రూ. 0.50 కోట్లు