విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ

Tuesday,February 11,2020 - 01:47 by Z_CLU

ఈ శుక్రవారం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గా ప్రేక్షకుల ముందుకొస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు విజయ్ మాటల్లోనే !

టైటిల్ యాప్ట్

కథకు తగ్గట్టుగా ఉండే టైటిల్స్ కోసం చూసాం. ‘ప్రియమ్’, ‘ముంబై తీరం’ లాంటి టైటిల్స్ కొన్ని అనుకున్నాం. కానీ అవన్నీ కొంచెం పాతగా అనిపించాయి. ఫైనల్ గా ఈ టైటిల్ పెట్టడం జరిగింది. సినిమా చూసాక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది.

సిక్సర్ ట్రై చేసా

సినిమా మీద నమ్మకం ఉంది. నా కెరీర్ లో బాగా కష్టపడి చేసిన సినిమా ఇది. నాలుగు వేరియేషన్స్ చూపిస్తూ నటించడంతో అన్ని సినిమాలకంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. సిక్సర్ ట్రై చేశా. బాల్ ఇంకా పైనే ఉంది. గ్రౌండ్ దాటి ఎగిరి సిక్స్ పడుతుందా ? లేదా గ్రౌండ్ లో పడి ఎవరైనా క్యాచ్ పడతారా చూడాలి.


‘సీనయ్య’ నా ఫేవరేట్

సినిమాలో నేను చేసిన క్యారెక్టర్స్ లో ‘సీనయ్య’ నా ఫేవరేట్. ఆ క్యారెక్టర్ కోసం మా నాన్న అప్పట్లో ఎలా ఉండే వాడో గుర్తుచేసుకుంటూ నటించా. ఇప్పుడంటే మా నాన్న షార్ట్స్ వేసుకుంటున్నారు కానీ అప్పట్లో ఆయన లుంగీ కట్టుకొని కొన్ని మేనరిజమ్స్ తో మాట్లాడే వారు. ఈ సినిమా వరకూ ఆయన్నే ఫాలో అయ్యాను.

ఆ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు

సినిమాలో ఐశ్వర్య రాజేష్ చేసిన సువర్ణ రోల్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. తనకి ఈ సినిమాతో తెలుగులో మంచి పేరొస్తుంది.

ప్రేమతో చేస్తున్నారనుకుంటా

సోషల్ మీడియాలో నా మీద కొన్ని మీమ్స్ చేసి ట్రోల్ చేస్తుంటారు. అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తా. వాళ్ళు నా గురించి టైం తీసుకొని వీడియో లేదా ఫోటో ఎడిట్ చేస్తున్నారంటే నా మీద ప్రేమతోనే అని భావిస్తాను. సో నేను ఎప్పుడూ వాళ్ళ మైండ్ లో ఉంటున్ననందుకు ఫీలింగ్ హ్యాపీ.


ఇది నా రెండో ఫేజ్

ఎవరికైనా లైఫ్ లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్ లో అలాంటి రెండో ఫేజ్ నడుస్తుంది. ఇకపై నాలో చాలా మార్పు చూడబోతున్నారు. రెండు మూడు నెలల్లో నన్ను మరింత కొత్తగా చూస్తారు.

అందుకే ఆ డిసీషన్

యాక్టర్ గా ఒక కొత్త ఫేజ్ లోకి వెళ్ళాలనుకుంటున్నా. అందుకే ఇదే లాస్ట్ లవ్ స్టోరీ అని చెప్పాను. రానున్న రెండేళ్ళలో నాలో ఆ మార్పు కనబడేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇకపై లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ తో సినిమాలు చేస్తాను. కానీ కంప్లీట్ లవ్ స్టోరీస్ మాత్రం వద్దనుకుంటున్నా. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో ఆల్మోస్ట్ నేను టచ్ చేయని ప్రేమకథలు కూడా చేసేశాను.

సూపర్ హిట్ తో పోలిస్తే సంతోషమేగా

నా సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, , ట్రైలర్ ఇలా ఏదొచ్చినా ‘అర్జున్ రెడ్డి’ తో పోలుస్తుంటారు. దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. నేను గెడ్డం పెంచితే అందరికీ ‘అర్జున్ రెడ్డి’ నే గుర్తొస్తుంది. ‘అర్జున్ రెడ్డి’ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. అందుకే ఆడియన్స్ మైండ్ లో ఎప్పుడూ ఆ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఓ లవ్ ట్రాక్ ‘అర్జున్ రెడ్డి’ ను పోలి ఉంటుంది. కానీ సేం ఉండదు. ఏదైనా ఫ్లాప్ మూవీ తో పోలిస్తే బాధ పడాలి. పోలుస్తుంది నా సూపర్ హిట్ సినిమాతోనే కాబట్టి ఏం ఫరక్ పడదు. సంతోషంగానే ఉంది.

పెద్దగా ప్రమోట్ చేయలేకపోయాను

‘డియర్ కామ్రేడ్’ లో సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. ఈ సాంగ్స్ ను పాపులర్ చేసి అందరికీ వినిపించాలని ఫిక్సయి అనిపించింది చేసాను. మ్యూజిక్ కన్సర్ట్స్ ప్లాన్ చేసి బాగా ప్రోమోట్ చేశా. కానీ ముంబైలో షూట్ ఉండటం వల్ల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ని పెద్దగా ప్రమోట్ చేయలేకపోయాను.


ఇంత మంది ఎందుకొస్తున్నారు

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చిన ఆడియన్స్ ని చూస్తూ అసలు నా కోసం ఇంత మంది ఎందుకొస్తున్నారు.. స్టేజి మీద ఎక్కినా వాళ్ళందరూ నా గురించి ఏదో గొప్పగా చెప్పాలని ఎందుకు ట్రై చేస్తున్నారు అని ఆలోచిస్తే కొత్తగా ఉంటుంది. నిజంగా ఈ స్టార్డం ఐ వాస్ నెవర్ ఎక్స్ పెక్టెడ్.

టికెట్స్ కొంటే చాలు

ఏ సినిమా కయినా మేము కష్టపడేది ఆడియన్స్ టికెట్స్ కొని థియేటర్స్ కి రావాలని.. ఇక నా ప్రతీ సినిమాకి రెండు రోజుల ముందే టికెట్స్ బుక్ అవ్వడం, ఆ తర్వాత హౌజ్ ఫుల్స్ అవ్వడం ఎంతో హ్యాపీ అనిపిస్తుంది.

క్రెడిట్ వారికే దక్కుతుంది

ఈ సినిమాకు సంబంధించి యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా ఆడియన్స్ కి నచ్చితే ఆ క్రెడిట్ మా డైరెక్టర్ క్రాంతి మాధవ్ కి, సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ, నిర్మాత రామారావు గారికే కే దక్కుతుంది. ఇది కంప్లీట్ గా క్రాంతి ఐడియా నుండి వచ్చిన స్క్రిప్ట్. సో తన రైటింగ్ తో ఆడియన్స్ ని మెప్పిస్తాడని నమ్ముతున్నా.

ఒక ఎక్సైట్ మెంట్ తో

పూరి గారితో చేస్తున్న సినిమాలో ఫైటర్ గా కనిపించడం కోసం చాలా కష్టపడుతున్నా. చాలా రోజుల తర్వాత ఒక ఎక్సైట్ మెంట్ తో చేస్తున్న సినిమా అది. “ఇట్స్ గోయింగ్ టూ బీ మెంటల్”, ” యూ విల్ సీ వన్ మ్యాడ్ నెస్”.