వీకెండ్ రిలీజ్

Wednesday,February 12,2020 - 05:04 by Z_CLU

ఈ వీకెండ్ వస్తున్న సినిమాల్లో ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ ఒకే ఒక్కటి. అదే విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించారు. నలుగురు అమ్మాయిల ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది ఈ సినిమా స్టోరీ.

ఈ సినిమా కథపై చాలా అంచనాలున్నాయి. పైగా విజయ్ దేవరకొండ మూవీ కావడంతో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాశిఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్యరాజేష్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ మూవీతో పాటు మరో 3 చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. సాగర్ శైలేష్-ఐషా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శివ 143. ఈ సినిమాలో సాగర్ శైలేజ్ హీరోగా నటించడమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే, స్టంట్స్, డాన్స్, కొరియోగ్రఫీ, డైరక్షన్.. ఇలా అన్నీ ఇతడే.

ఇక రవితేజ, శ్రావణి, శృతి షెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన లైఫ్ అనుభవించురాజా కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. సురేష్ తిరుమూర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు రాజారెడ్డి కందుల నిర్మాత. ఈ సినిమాతో పాటు సంజయ్ వర్మ, గరిమా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఒక చిన్న విరామం అనే సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది.