జీ సినిమాలు ( 4th జనవరి )

Friday,January 03,2020 - 10:02 by Z_CLU

పోలీస్ స్టోరీ-2
హీరో – సాయికుమార్
ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం
సంగీతం – ఆర్పీ పట్నాయక్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు
విడుదల తేదీ – 1996
అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2నుతెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడాపనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే.

=============================================================================

అహ నా పెళ్ళంట
నటీనటులు అల్లరి నరేష్శ్రీహరిరీతు బర్మేచ
ఇతర నటీనటులు : అనిత హాసనందినిబ్రహ్మానందంఆహుతి ప్రసాద్సుబ్బరాజువిజయ్ సామ్రాట్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : వీరభద్రం
ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 2 మార్చి 2011
రియల్ స్టార్ శ్రీహరినరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

శ్రీమంతుడు
నటీనటులు మహేష్ బాబుశృతి హాసన్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్జగపతి బాబుసుకన్యసితారముకేష్ రిషిసంపత్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ కొరటాల శివ
ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్
రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015

కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్షఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనేఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకితన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..అనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

లౌక్యం
నటీనటులు : గోపీచంద్రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : బ్రహ్మానందంముకేష్ రిషిసంపత్ రిషిచంద్ర మోహన్రాహుల్ దేవ్మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్
డైరెక్టర్ శ్రీవాస్
ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014

గోపీచంద్రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆఇంట్లోంచి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో ఆ అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత ఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడువెంకీ ఏం చేస్తాడు..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

అరవింద సమేత

నటీనటులు : N.T. రామారావు, పూజా హెగ్డే

ఇతర నటీనటులు : ఈషా రెబ్బ, సునీల్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్,  నాగబాబు, రావు రమేష్, నరేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018

కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు)నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి.

అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)… అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది.

ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదా… అనేది సినిమా కథ.

==============================================================================

శివలింగ తో శివగంగ

శివలింగ, శివగంగ సినిమాలను కలిపి సరికొత్త స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది జీ సినిమాలు. అనుక్షణం ఉత్కంఠ రేపే ఈ హారర్ థ్రిల్లర్ ని ‘జీ సినిమాలు‘ లో రాత్రి 9:00 గంటల నుండి చూసి ఎంజాయ్ చేయండి.