World Famous Lover అందుకే ఫెయిలైంది

Tuesday,August 11,2020 - 05:46 by Z_CLU

భారీ అంచనాల మధ్య వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫ్లాప్ అయింది. అది ఫ్లాప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే మెయిన్ రీజన్స్ ఏంటనేది ఆ మూవీ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు చెబుతున్నారు.

“ఇది నెక్ట్స్ జనరేషన్ ఫిలిం. ఇలాంటి కల్చర్, ఫార్ములాతో సినిమాలు పెద్దగా ఇక్కడ రాలేదు. Vijay Deverakonda క్రేజ్ అంచనాల్ని పెంచేసింది. దీంతో మా సినిమా ఇబ్బంది పడింది. అతడి ఫ్యాన్స్ ను శాటిస్ ఫై చేయాలంటే గ్రేటెస్ట్ ఎఫెర్ట్స్ పెట్టాల్సిందే. అలాంటివి కొన్ని లోపించాయి.”

లివింగ్ టుగెదర్ అనే కల్చర్ చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియదని, అందుకే World Famous Lover సినిమాను పెద్దగా రిసీవ్ చేసుకోలేకపోయారని అన్నారు కేఎస్ రామారావు. దీనికితోడు సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డైలాగ్స్, సీన్స్ ప్రేక్షకులకు అర్థమై, అర్థంకానట్టు ఉన్నాయని అన్నారు.