ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ పేరే...

Thursday,December 12,2019 - 01:17 by Z_CLU

2019 లో సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఎక్కువగా గూగుల్ లో ట్రెండ్ అయిన పేరు విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ఏదో ఒక కారణంతో నెటిజన్స్ కి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లా మారిన విజయ్ దేవరకొండ, గూగుల్ లో ఈ ఏడాదికి గాను ఎక్కువగా సర్చ్ అయిన సౌత్ ఇండియన్ స్టార్స్ లిస్టులో నమోదైంది.

ఈ ఏడాది ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో సందడి చేస్తే, వరసగా తన సినిమా రెండేసి భాషల్లో ఈ ఏడాదే రిలీజ్ కావడం విజయ్ దేవరకొండ పేరును మరింత లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. తన కరియర్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ తమిళ, హిందీ రీమేక్స్ ఈ ఏడాదే రిలీజవ్వడం… ఈ సినిమా క్రియేట్ చేసిన డిస్కర్షన్స్ న్యాచురల్ గానే విజయ్ దేవరకొండ పేరు కూడా ఇన్వాల్వ్ అవ్వడం… ఏడాది మొత్తం విజయ్ దేవరకొండని గూగుల్ లో ఆక్టివ్ కీవర్డ్ లా చేసింది.

హీరోగానే కాకుండా ఈ ఏడాది నిర్మాతగా ‘మీకు మాత్రమే చెప్తా..’ కూడా చేశాడు విజయ్ దేవరకొండ. దానికి తోడు ఎప్పటికప్పుడు బోల్డ్ స్టేట్ మెంట్స్, స్టైలిష్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేసిన విజయ్ దేవరకొండ, ఈ ఏడాది మొత్తం ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి చోట తన మార్క్ ని క్రియేట్ చేశాడు.