విజయ్ దేవరకొండ – జాహ్నవి కపూర్ జోడీగా సినిమా

Saturday,October 06,2018 - 11:03 by Z_CLU

విజయ్ దేవరకొండ, జాహ్నవి కపూర్ జోడీగా సినిమా తెరకెక్కనుందా…? నిన్నా, మొన్నటి వరకు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బజ్, మొత్తానికి జస్ట్ గాసిప్ అని డిక్లేర్ అయిపోయింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో జాహ్నవి కపూర్ ‘ఇప్పట్లో తెలుగు సినిమా చేసే ఆలోచన లేద’ని చెప్పడంతో, ఈ రూమర్ కి చెక్ పడింది.

రీసెంట్ గా ‘ధడక్’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్, ప్రస్తుతం బాలీవుడ్ లో తన సెకండ్ మూవీ ప్రిపరేషన్స్ లో ఉంది. అయితే ఈ లోపు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండకు జోడీగా జాహ్నవి కపూర్ ని సంప్రదించారని, ఆల్మోస్ట్ ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసినట్టే అనే టాక్ కాస్త గట్టిగానే చక్కర్లు కొట్టింది.

శ్రీదేవి కూతురుగా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న ‘జాహ్నవి కపూర్’ టాలీవుడ్ డెబ్యూ పై ప్రస్తుతానికి హోప్స్ లేకపోయినా, చేస్తే బావుండు అనే ఫీలింగ్ మాత్రం ఫ్యాన్స్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.